Vikarabad: సైబర్ అవగాహన పోస్టర్లను విడుదల చేసిన ఎస్పీ స్నేహ మెహ్రా!
Vikarabad: జాతీయ సైబర్ సెక్యూరిటీ అవర్‌నెస్ నెల సందర్భంగా వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా సైబర్ అవగాహన పోస్టర్లను విడుదల చేశారు.
Vikarabad: సైబర్ అవగాహన పోస్టర్లను విడుదల చేసిన ఎస్పీ స్నేహ మెహ్రా!
Vikarabad: అక్టోబర్ నెలను జాతీయ సైబర్ సెక్యూరిటీ అవేర్‌నెస్ నెలగా పాటిస్తున్న సందర్భంగా, ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, IPS* గారు సైబర్ అవగాహన పోస్టర్లను విడుదల చేశారు.
ప్రతి నెల మొదటి బుధవారం నిర్వహించే సైబర్ జాగ్రూక్తా దివస్*లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, సైబర్ నేరగాళ్లు ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, సోషల్ మీడియా, నకిలీ ఆఫర్లు, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, లోన్ యాప్‌లు, ఇతరులుగా నటించడం తదితర మార్గాల ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు.
ప్రతి ఒక్కరూ “PAUSE – THINK – VERIFY” విధానాన్ని పాటించాలని సూచించారు. అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దని, ఆకర్షణీయమైన ఆఫర్లను నమ్మి ముందస్తు చెల్లింపులు చేయవద్దని, అనధికారిక లోన్ యాప్‌లను ఉపయోగించవద్దని సూచించారు. అలాగే OTP, UPI PIN, ATM PIN, CVV, పాస్‌వర్డ్‌లు* వంటి గోప్యమైన సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని ప్రజలకు సూచించారు.
సైబర్ మోసానికి గురైనట్లయితే ప్రజలు వెంటనే 1930కు కాల్ చేసి, www.cybercrime.gov.in* ద్వారా ఫిర్యాదు నమోదు చేయాలని ఎస్పీ గారు సూచించారు.
ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ డీఎస్పీ కాజోల్ జైస్వాల్, DCRB డీఎస్పీ జనయ్య, AR డీఎస్పీ వీరేష్ తదితరులు పాల్గొన్నారు.




