Hyderabad: భార్యను చంపి అత్తాపూర్ పీఎస్‌లో లొంగిపోయిన భర్త!

Hyderabad: కవాడిగూడ స్పా సెంటర్ బ్యూటీషియన్ బంగి దేబోరా హత్య కేసులో నిందితుడైన ఆమె భర్త అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.

GIRI, CENTRAL ZONE
Published on: 19 May 2026 1:00 PM IST
Hyderabad
X

Hyderabad: భార్యను చంపి అత్తాపూర్ పీఎస్‌లో లొంగిపోయిన భర్త!

హైదరాబాద్: నగరంలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కవాడిగూడలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. కవాడిగూడలోని రత్నదీప్ బిల్డింగ్ నాలుగో అంతస్తులో శ్వేత అనే మహిళను గుర్తుతెలియని వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేసి పరారయ్యాడు.సమాచారం అందుకున్న వెంటనే గాంధీనగర్ పోలీసులు, క్లూస్ టీం సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తూ దర్యాప్తు చేపట్టారు.సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా నిందితుడి వివరాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

హత్యకు గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.బహదూర్ పూర్ కిషన్ బాగ్ కు చెందిన బంగి దేబోరా మహిళ కవాడిగూడ లో స్పా సెంటర్ లో బ్యూటీషన్ లో పని చేస్తుంది. ఉదయం భర్తతో గొడవపడి స్పా సెంటర్ కు వచ్చింది భర్త స్పా సెంటర్ చేరుకొని , తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణ రహితంగా పొడిచి హతమార్చి పరారయ్యాడ అనంతరం అత్తర్ పూర్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన భర్త.

GIRI, CENTRAL ZONE

GIRI, CENTRAL ZONE

Next Story