Vikarabad: మర్పల్లిలో చేయూత పింఛన్ పత్రాలు అందజేసిన స్పీకర్ ప్రసాద్!
Vikarabad: వికారాబాద్ నియోజకవర్గం మర్పల్లి ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరు పత్రాలు అందజేశారు.
Vikarabad: మర్పల్లిలో చేయూత పింఛన్ పత్రాలు అందజేసిన స్పీకర్ ప్రసాద్!
వికారాబాద్: వికారాబాద్ నియోజకవర్గంలోని మర్పల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి తెలంగాణ శాసనసభ స్పీకర్, వికారాబాద్ శాసనసభ్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు హాజరయ్యారు.
మర్పల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరు పత్రాలను స్పీకర్ గారు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా స్పీకర్ గారు మాట్లాడుతూ...
పెన్షన్ రావడం అనేది లబ్ధిదారులకు 12 ఏళ్ల కల. గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ రావాలంటే లబ్ధిదారులు ఎన్నో ఇబ్బందులు పడేవారు. కానీ ఈ ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందుతున్నాయి. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. అర్హులందరికీ న్యాయం చేస్తాం.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం, సంక్షేమ పథకాలను అమలు చేయడం కోసం ప్రతిరోజూ 18 గంటల పాటు నిర్విరామంగా కష్టపడుతున్నారు. అలాంటి నాయకుడి నాయకత్వంలో తెలంగాణ ముందుకు వెళ్తోంది.
ప్రజా ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తోంది. గత ప్రభుత్వం 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసింది. వాటికి వడ్డీలు కూడా ప్రభుత్వమే కడుతోంది. ప్రజా ప్రభుత్వం ఎక్కడా సంక్షేమ పథకాలను ఆపడం లేదు. అభివృద్ధి కార్యక్రమాలను ఆపడం లేదు.
ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహిళలను లక్షాధికారులను చేయాలని వడ్డీ లేని రుణాలు ఇచ్చారు. ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలను కోటీశ్వరులను చేయాలన్న గొప్ప సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే అనేక ప్రభుత్వ పథకాలను మహిళల పేరిటనే అమలు చేస్తున్నారు.
వికారాబాద్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాను. ఇప్పటికే ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం. ఇప్పటికే 1000 కోట్ల రూపాయల నిధులతో రోడ్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. మరికొన్ని చోట్ల త్వరలోనే ప్రారంభోత్సవాలు చేస్తాం. అన్ని గ్రామాలకు, అన్ని మండలాలకు రోడ్లతో పాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలు సమకూరుస్తాం.
ఎవరైనా నా పైన విమర్శలు చేయాలనుకుంటే నిర్మాణాత్మకంగా చేయాలి. పనులు చేయకపోతే విమర్శలు చేయండి. అంతేగానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదు. గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ప్రత్యేకంగా మరిన్ని నిధులు తీసుకొచ్చి, మన వికారాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాను.
గత ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదు. రైతులకు సంబంధించిన సబ్సిడీలను పూర్తిగా ఎత్తివేసింది. కానీ ఈ ప్రజా ప్రభుత్వం వచ్చాక రైతులకు అందాల్సిన సబ్సిడీలన్నీ అమలు చేస్తోంది. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేశారు. ఇచ్చిన హామీని నెరవేర్చారు.
గత ప్రభుత్వాలు డబుల్ బెడ్ రూమ్ పేరిట ప్రజలను ఎన్నో ఆశలకు గురి చేశాయి. ఏ ఒక్కరికీ డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదు. కానీ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పేరిట అర్హులైన మహిళలకు ఇండ్లు ఇస్తోంది. ఇండ్లు రాని వారు ఎవరూ అధైర్యపడవద్దు. మీ అందరికీ, ప్రతి ఒక్కరికీ ఇండ్లు వచ్చేలా నేను కృషి చేస్తాను.
ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎవరికైనా సొంత స్థలం లేకపోతే, గ్రామాల్లోని ప్రభుత్వ స్థలాల్లోనే వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే విధంగా కృషి చేస్తాం. ఇప్పటికే అధికారులతో కూడా మాట్లాడుతున్నాం.
ఎల్ నినో ప్రభావం వల్ల రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కరువు పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల రైతులు, ప్రజలు, మహిళలు, వ్యవసాయ శాఖ అధికారులు ప్రజా ప్రభుత్వం ఇచ్చే సలహాలు, సూచనలు తప్పనిసరిగా పాటించాలి. నీటిని పొదుపుగా వాడుకుందాం. కరెంటును కూడా పొదుపుగా వాడుకుందాం.
ఈ నెల 19వ తేదీన సిద్దిపేటలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని అమలు చేయబోతున్నారు. కులం, మతం, ఆదాయంతో సంబంధం లేకుండా *ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల జీవిత బీమా అందించే గొప్ప పథకం ఇది.
ఈ కార్యక్రమంలో మర్పల్లి మండల స్పెషల్ ఆఫీసర్ నరసింహా రెడ్డి, ఎంఆర్ఓ మనోజ్ చక్రవర్తి, ఎంపీడీఓ శాంతమ్మ, ఏఎంసీ చైర్మన్ మహేందర్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ జి. మల్లేష్ యాదవ్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎం. కృష్ణా రెడ్డి, జిల్లా మాజీ వైస్ ప్రెసిడెంట్ వి. రవీందర్, మండల సర్పంచుల ప్రెసిడెంట్ ఎండీ. రఫీ, మర్పల్లి సర్పంచ్ రమేష్ వర్మ, లైబ్రరీ మాజీ చైర్మన్ ఎస్. కొండల్ రెడ్డి, సీనియర్ నాయకులు జి. రాములు యాదవ్, జి. సుభాష్ యాదవ్, శంకరయ్య గౌడ్, మండల సీనియర్ నాయకులు, సర్పంచులు, గ్రామస్తులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




