Vikarabad: బుగ్గ రామేశ్వరం రోడ్డు ప్రమాదంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ దిగ్భ్రాంతి!
Vikarabad: వికారాబాద్ బుగ్గ రామేశ్వరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందడంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Vikarabad: బుగ్గ రామేశ్వరం రోడ్డు ప్రమాదంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ దిగ్భ్రాంతి!
Vikarabad: వికారాబాద్ జిల్లాలోని బుగ్గ రామేశ్వరం ఆలయం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై తెలంగాణ శాసనసభ సభాపతి, వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం చాలా బాధాకరమని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు స్పీకర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రమాదం జరిగిన తీరుపై స్థానిక పోలీస్ అధికారులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆసుపత్రులకు తరలించాలని కార్యకర్తలను, అధికారులను, పోలీసులను ఆదేశించారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని డాక్టర్లను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని స్పీకర్ భరోసా ఇచ్చారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, స్పీకర్ ప్రార్థించారు.




