Dharur: హరిదాస్‌పల్లిలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన స్పీకర్ ప్రసాద్!

Dharur: ధారూర్ మండలం హరిదాస్‌పల్లిలో లబ్ధిదారులు నిర్మించిన నూతన ఇందిరమ్మ ఇల్లును తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు.

MOGULAIAH, VIKARABAD
Published on: 25 Jun 2026 9:53 PM IST
Dharur
X

Dharur: హరిదాస్‌పల్లిలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన స్పీకర్ ప్రసాద్!

ధరూర్: ధారూర్ మండలం హరిదాస్ పల్లి లో లబ్ధిదారులు రుక్కుంపల్లి అనురాధ ప్రభాకర్ నిర్మించిన నూతన ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించి, గృహప్రవేశం చేయించిన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్.

వెంట ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు ఈసందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు మాట్లాడుతూ... దేశంలో పేదలకు ఎక్కువగా సేవ చేసింది స్వర్గీయ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు. కూడు, గుడ్డ, నీడ కల్పించడమే లక్ష్యంగా పనిచేశారు.

అదేవిధంగా ఉమ్మడి ఆంద్రప్రదేశ్ గా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేశారు. పూరి గుడిసెలలో, సగం కూలిన బండల ఇళ్ళలో, అద్దెకు ఉంటూ, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, పిల్లలతో ఇబ్బందులు పడుతున్న పేదలకు కాసింత నీడ ఇవ్వాలనే మంచి ఆశయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఒక్కో ఇంటికి అయిదు లక్షల రూపాయల ఆర్ధిక సహాయంతో ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేస్తున్నారు.

మన నియోజకవర్గంలో స్వంత ఇల్లు లేని పేదలందరికి ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేయిస్తాను. భవిష్యత్తులో మన నియోజకవర్గంలో అందరికీ స్వంత ఇళ్ళు ఉండాలని నా కోరిక. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాం, ఇందిరమ్మ ఇంటి కమిటీల ద్వారా వడబోసి అర్హులైన పేదోళ్ళకే ఇస్తున్నాం.

ముందు స్వంత స్థలం ఉండి ఇళ్ళు లేనివారికి మొదటగా ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేస్తున్నాం. తరువాత విడతల వారిగా అందరికీ ఇస్తాం. అర్హులైన పేదలందరికీ వస్తాయి. ఇందిర‌మ్మ ఇండ్లకు సంబంధించిన బిల్లులు ఎప్పటికప్పుడు బ్యాంకు అకౌంట్లోకి వస్తాయి.

ఆలస్యం ఉండదు. పని పూర్తి కాగానే వెంటనే పైసలు వస్తాయి. మద్యలో ఎవ్వరు మధ్యవర్తిత్వం లేకుండా ఇందిరమ్మ ఇంటి డబ్బులు డైరెక్ట్ గా మొత్తం నాలుగు విడ‌త‌ల్లో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోనే డబ్బులు జ‌మ‌ అవుతున్నాయి. గత ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూం ఇళ్ళు అంటూ మోసం చేశారు.

మన ప్రభుత్వం వచ్చాక ప్రతి రోజు ఇందిరమ్మ ఇళ్ళ గృహ ప్రవేశాలు జరుగుతున్నాయి. అది మాటల ప్రభుత్వం ఇది చేతల ప్రభుత్వం.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD

Next Story