Amanagallu: ఆమనగల్లులో ఘనంగా గణపయ్య పూజలు.. బజరంగ్‌ యూత్‌ ఆధ్వర్యంలో వేడుకలు!

Amanagallu: ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలో బజరంగ్‌ యూత్‌ ఆధ్వర్యంలో వినాయక మండపంలో ప్రత్యేక పూజలు. హాజరైన మున్సిపల్ చైర్మన్ పత్యనాయక్, ప్రజాప్రతినిధులు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 23 Sept 2026 4:58 PM IST
Amanagallu
X

Amanagallu: ఆమనగల్లులో ఘనంగా గణపయ్య పూజలు.. బజరంగ్‌ యూత్‌ ఆధ్వర్యంలో వేడుకలు!

Amanagallu: ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు పోస్ట్‌ ఆఫీస్‌ కాలనీలో బజరంగ్‌ యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో బుధవారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్సిపల్‌ చైర్మన్‌ డాక్టర్‌ పత్యనాయక్‌, మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ చైర్మన్‌ గుర్రం కేశవులు, కౌన్సిలర్‌ పుల్లారెడ్డి అనూష శ్రీశైలం, కోఆప్షన్‌ సభ్యుడు అబ్దుల్‌ ఖాదర్‌ ముఖ్య అతిథులుగా హాజరై గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా సీనియర్‌ నాయకులు గుత్తి బాలస్వామి ముఖ్య అతిథులను శాలువాతో సత్కరించారు. అనంతరం భక్తులు గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గణపయ్య ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో మంచుకొండ విష్ణు, కరీం, సురేష్‌ నాయక్‌, సాయిబాబా, శంకర్‌, గాజుల వెంకటేష్‌, గుత్తి దామోదర్‌, మంచుకొండ చంద్రశేఖర్‌, గుత్తి శేఖర్‌, సారంగుల శివ, హరీష్‌, బజరంగ్‌ యూత్‌ సభ్యులు గుత్తి రాహుల్‌, లక్కీ, సచిన్‌, యశ్వంత్‌, చరణ్‌, భరత్‌, బాబీ, హర్షిత్‌, శరత్‌, అజయ్‌, నాని, రిక్కీ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY