Vikarabad: అనంతగిరిలో శ్రావణ సోమవారం, నాగుల పంచమి వేళ విశేష పూజలు

Vikarabad: వికారాబాద్ జిల్లా అనంతగిరి బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ సోమవారం, నాగుల పంచమి వేళ భక్తుల రద్దీ. వీరశైవ సమాజం ఆధ్వర్యంలో అన్నదానం.

MOGULAIAH, VIKARABAD
Published on: 17 Aug 2026 3:22 PM IST
Vikarabad
X

Vikarabad: అనంతగిరిలో శ్రావణ సోమవారం, నాగుల పంచమి వేళ విశేష పూజలు

Vikarabad: అనంతగిరిలో శ్రావణ సోమవారం, నాగుల పంచమి వేళ రామలింగేశ్వరునికి విశేష పూజలు.​ప్రముఖ పుణ్యక్షేత్రం అనంతగిరి బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం మొదటి సోమవారం పురస్కరించుకుని భక్తుల రద్దీ నెలకొంది. శ్రావణ సోమవారంతో పాటు ఇవాళ నాగుల పంచమి కూడా రావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

​ఈ సందర్భంగా ఆలయంలో వీరశైవ సమాజం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రావణ మాస నిత్య అన్నప్రసాద వితరణ నేటికి 5వ రోజుకు చేరుకుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు నిరంతరం అన్నదాన సేవలు అందిస్తున్నారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD

Next Story