Hyderabad: బాబా నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టి కిందపడిన కారు!

Hyderabad: హైదరాబాద్ పాతబస్తీ కాంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబా నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

MOHD MOHIUDDIN, YAKUTHAPURA
Published on: 15 Oct 2026 9:56 AM IST
Hyderabad
X

Hyderabad: బాబా నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టి కిందపడిన కారు!

Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలోని కాంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాబా నగర్ ఫంక్షన్ హాల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన మహీంద్రా కారు డివైడర్‌ను ఢీకొట్టి కింద రోడ్డుపై పడిపోయింది.

కారులో ఇద్దరు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. స్థానికులు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, దీనిపై అధికారిక నిర్ధారణ కావాల్సి ఉంది.

ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా, కారు భారీగా దెబ్బతింది. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కారు యజమానిని కాంచన్‌బాగ్ పోలీసులు విచారిస్తున్నారు. క్రేన్ సహాయంతో కారును తొలగించిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

MOHD MOHIUDDIN, YAKUTHAPURA

MOHD MOHIUDDIN, YAKUTHAPURA