Jubilee Hills: మత సామరస్యం, సామాజిక ఐక్యతకు ఆధ్యాత్మిక సభలు దోహదం: ఎమ్మెల్యే!
Jubilee Hills: జూబ్లీహిల్స్ కార్మిక నగర్లో జమియత్ ఉలమా హల్కా నిర్వహించిన ఏడవ జల్సా-ఏ-ఆమ్ ఆధ్యాత్మిక సభలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
Jubilee Hills: మత సామరస్యం, సామాజిక ఐక్యతకు ఆధ్యాత్మిక సభలు దోహదం: ఎమ్మెల్యే!
జూబ్లీహిల్స్: జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని కార్మిక నగర్లో జమియత్ ఉలమా హల్కా ఆధ్వర్యంలో ఏడవ అజీమ్-ఉషాన్ జల్సా-ఏ-ఆమ్ (ఆధ్యాత్మిక సభ)ను అత్యంత ఘనంగా నిర్వహించారు..కార్మిక నగర్ చౌరస్తాలోని ఆటో స్టాండ్ వద్ద నిర్వహించిన ఈ సభలో 'పయామ్-ఏ-సీరత్-ఏ-ముస్తఫా వ ఇస్లాహ్-ఏ-ముఆషరా' అనే అంశంపై పలువురు ప్రముఖ ఉలమాలు, మతపెద్దలు ఆధ్యాత్మిక సందేశాలను అందించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గారు.ఈ సందర్భంగా మతపెద్దలు, నిర్వాహకులతో కలిసి కార్యక్రమంలో పాల్గొని వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు. సమాజంలో ప్రేమ, సోదరభావం, పరస్పర గౌరవం, మత సామరస్యం పెంపొందించడంలో ఇలాంటి ఆధ్యాత్మిక సభలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బంజారాహిల్స్ ఏసీపీ వెంకట్ రెడ్డి, మధురానగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. ప్రభాకర్, పలువురు ప్రముఖ ఉలమాలు, మతపెద్దలు, నిర్వాహకులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




