Karmanghat: మ్యాచ్‌కు ముందు హనుమాన్ ఆశీస్సులు కోరిన ఎస్‌ఆర్‌హెచ్ స్టార్

Karmanghat: సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు.

RAHUL, MEERPET
Published on: 2 May 2026 6:59 PM IST
Karmanghat
X

Karmanghat: మ్యాచ్‌కు ముందు హనుమాన్ ఆశీస్సులు కోరిన ఎస్‌ఆర్‌హెచ్ స్టార్

Karmanghat: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ శనివారం కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా అభిషేక్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ సందర్శనకు సంబంధించిన ఫొటోలను అభిషేక్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. ఇప్పటికే SRH ఆటగాళ్లు బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయాలను కూడా దర్శించుకున్న విషయం తెలిసిందే.

ఆలయ దర్శనాల అనంతరం అభిషేక్ శర్మ మంచి ఫామ్‌లో కొనసాగుతూ, మ్యాచ్‌లలో వరుసగా హాఫ్ సెంచరీలు, సెంచరీలతో ఆకట్టుకుంటున్నారు. కాగా, రేపు జరగనున్న మ్యాచ్‌లో SRH జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో తలపడనుంది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ లావణ్య, చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, ధర్మకర్తలు పాల్గొన్నారు.

RAHUL, MEERPET

RAHUL, MEERPET

Next Story