Hyderabad: బీజేపీ ఎండోమెంట్ సెల్ సలహాదారుగా శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి

Hyderabad: బీజేపీ ఎండోమెంట్ సెల్ సలహాదారుగా నియమితులైన శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి. తన 56వ జన్మదిన వేడుకల్లో భాగంగా అనాథలకు, వృద్ధులకు సేవా కార్యక్రమాలు.

RAJESH,	WEST ZONE
Published on: 11 July 2026 3:00 PM IST
Hyderabad
X

Hyderabad: బీజేపీ ఎండోమెంట్ సెల్ సలహాదారుగా శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి

హైదరాబాద్: బీజేపీ ఎండోమెంట్ సెల్ తెలంగాణ రాష్ట్ర కమిటీకి ముఖ్య సలహాదారుగా ఎంపిక కావ‌డం సంతోషంగా ఉంద‌ని శ్రీ చాముండేశ్వ‌రి అనుగ్ర‌హ పీఠాధిప‌తి శ్రీకృష్ణ చాముండేశ్వ‌ర మ‌హ‌ర్షి అన్నారు.

హైద‌రాబాద్ శ్రీన‌గ‌ర్ కాల‌నీలోని శ్రీ చాముండేశ్వ‌రి అనుగ్ర‌హ పీఠంలో త‌న జ‌న్మ‌దినం రోజున ఆధ్యాత్మిక ,సామాజిక సేవ చేయ‌డానికి మంచి ఈ అవ‌కాశం ల‌భించింద‌న్నారు.

తెలంగాణ‌కు ఆధ్యాత్మిక సూచ‌న‌లు, స‌ల‌హాలు అందించేందుకు అవ‌కాశం క‌ల్పించిన బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ చంద్ర‌రావుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

త‌న జ‌న్మ‌దినంను పుర‌స్క‌రించుకుని శ్రీ చాముండేశ్వ‌రి అనుగ్ర‌హ పీఠంలో అనాధ శరణాలయాలకు,వృద్ధులకు,మహిళలకు చీరలు- దుప్పట్లు ,అన్న ప్రసాదం అందించామ‌ని మ‌హ‌ర్షి తెలిపారు.

హైద‌రాబాద్ లోనే కాకుండా త‌న‌ 56 వ జన్మదిన సందర్భంగా నాలుగు రాష్ట్రాలలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు . అనంత‌రం శ్రీ చాముండేశ్వ‌రి మాత‌కు విశేష పుష్పాల‌తో అర్చ‌న‌, అభిషేకాలు నిర్వ‌హించారు .భ‌క్తులు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చి స్వామి వారి ఆశిస్సులు తీసుకున్నారు .

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story