Malkajgiri: చంద్రపురి కాలనీలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Malkajgiri: మల్కాజ్‌గిరి పరిధిలోని చంద్రపురి కాలనీలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.

PURENDAR, ALWAL
Published on: 4 Sept 2026 2:43 PM IST
Malkajgiri
X

Malkajgiri: చంద్రపురి కాలనీలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

మల్కాజ్‌గిరి: మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కీసర సర్కిల్ పరిధిలోని చంద్రపురి కాలనీ డివిజన్‌లో శ్రీకృష్ణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

యాదవ సంఘం అధ్యక్షుడు అశోక్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చంద్రపురి కాలనీ డివిజన్ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ పాల్గొని శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీకృష్ణుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. భక్తి, ఆధ్యాత్మికతతో కూడిన ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాట్ల వినయ్ కుమార్, బింగి సతీష్, రెడ్డిశెట్టి మహేష్, నాయకం భాస్కర్, యాదవ సంఘం సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

PURENDAR, ALWAL

PURENDAR, ALWAL