Hayathnagar: భక్తిశ్రద్ధలతో వెంకటేశ్వర స్వామి ఆలయ ముఖద్వారం ప్రారంభం!
Hayathnagar: హయత్‌నగర్ తిరుమల కాలనీలో శ్రీ వేంకటేశ్వర స్వామి నూతన ఆలయ ముఖద్వారం ప్రారంభోత్సవం. పాల్గొన్న మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి, బిజెపి నేతలు.
Hayathnagar: భక్తిశ్రద్ధలతో వెంకటేశ్వర స్వామి ఆలయ ముఖద్వారం ప్రారంభం!
Hayathnagar: శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో హయత్‌నగర్ డివిజన్‌లోని తిరుమల కాలనీలో భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిర్మిస్తున్న శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి నూతన ఆలయ ముఖద్వారం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి పాల్గొని ఆలయ నిర్వాహకులను, ఆలయ నిర్మాణానికి సహకరిస్తున్న భక్తులను అభినందించారు. నూతన ఆలయ నిర్మాణ పనులు త్వరగా పూర్తై, భవిష్యత్తులో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరగాలని ఆకాంక్షించారు.
తిరుమల కాలనీ ప్రజలకు ఈ ఆలయం భవిష్యత్తులో ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచి, భక్తులకు ప్రశాంతతను, దైవానుగ్రహాన్ని అందించాలని ఆయన కోరుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపాకటాక్షాలు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జీవన్ అన్నా మిత్ర బృందం సభ్యులు బద్దం రవీందర్ రెడ్డి, బీజేపీ డివిజన్ అధ్యక్షులు గంగాని శ్రీనివాస్, బీజేపీ సీనియర్ నాయకులు పాండల శ్రీనివాస్, ఆలయ నిర్వాహకులు, కాలనీవాసులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.




