Kapra: బ్యాండ్ కళాకారుల సదస్సుకు భారీగా తరలిరావాలి

Kapra: హైదరాబాద్‌లోని సుందరయ్య కళానిలయంలో ఈ నెల 16న రాష్ట్రస్థాయి బ్యాండ్ కళాకారుల సదస్సు.

ASHOK, KAPRA
Published on: 11 Jun 2026 2:06 PM IST
Kapra
X

Kapra: బ్యాండ్ కళాకారుల సదస్సుకు భారీగా తరలిరావాలి

KAPRA: ఆధునిక వృత్తి, ఉపాధి కల్పన సాధనకై ఈ నెల 16న హైదరాబాద్‌లోని సుందరయ్య కళానిలయంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి బ్యాండ్ కళాకారుల సదస్సును విజయవంతం చేయాలని శ్రీ మంజునాథ బ్యాండ్ కళాకారుల సంఘం నాయకులు పిలుపునిచ్చారు.

రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కుషాయిగూడలోని శివాంజనేయ దేవస్థానం వద్ద సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బ్యాండ్ కళాకారులు ఎదుర్కొంటున్న ఉపాధి సమస్యలు, ప్యాడ్ బ్యాండ్ వాహనాల సీజ్‌లు, పోలీసుల వేధింపులపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.

బ్యాండ్ కళాకారుల సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయడంతో పాటు వడ్డీ రహిత రుణాలు, గుర్తింపు కార్డులు, పెన్షన్ సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సౌండ్ పొల్యూషన్ కంట్రోల్ కమిషన్ ఏర్పాటు చేసి కళాకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని అన్నారు.

మల్కాజిగిరి, ఉప్పల్, మేడ్చల్ నియోజకవర్గాల పరిధిలోని కళాకారులు పెద్ద సంఖ్యలో సదస్సుకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు పి. నగేష్, ఉపాధ్యక్షుడు మేడిపల్లి శ్రీశైలం, కోశాధికారి చింతల శేఖర్, అమాస బాలప్ప, చంద్రమౌళి, రామచందర్, ఆంజనేయులు, సి. రాములు తదితరులు పాల్గొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA

Next Story