Hyderabad: సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జి వద్ద ఊడిపడ్డ భారీ నట్!

Hyderabad: హైదరాబాద్ సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జి వద్ద తీవ్ర కలకలం.. ప్రారంభమైన 20 రోజుల్లోనే ఊడిపడ్డ భారీ నట్, భయాందోళనలో వాహనదారులు.

MOHD MOHIUDDIN, YAKUTHAPURA
Published on: 16 Sept 2026 1:54 PM IST
Hyderabad
X

Hyderabad: సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జి వద్ద ఊడిపడ్డ భారీ నట్!

Hyderabad: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 3, 2026న ఎంతో ఘనంగా ప్రారంభించిన ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం జరిగి ఇంకా 20 రోజులు కూడా నిండకముందే.. బ్రిడ్జికి సంబంధించిన ఒక భారీ నట్ (బోల్ట్) ఊడి కింద రోడ్డుపై పడటం స్థానికులను, వాహనదారులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.

నిత్యం వేలాది రవాణా వాహనాలు, బస్సులు ప్రయాణించే రద్దీగల సంతోష్ నగర్ ప్రధాన రహదారిపై ఈ ప్రమాదకర వాతావరణం నెలకొంది.

స్టీల్ బ్రిడ్జి క్వాలిటీపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ప్రయాణికులు భయపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత జీహెచ్‌ఎంసీ, కాంట్రాక్ట్ ఇంజనీరింగ్ అధికారులు వెంటనే స్పందించి, బ్రిడ్జి భద్రతను పూర్తిగా తనిఖీ చేయాలని సంతోష్ నగర్ ప్రజలు డిమాండ్.

MOHD MOHIUDDIN, YAKUTHAPURA

MOHD MOHIUDDIN, YAKUTHAPURA