Hyderabad: ఓయూలో వసతి గృహాల కూల్చివేత యత్నాలను విరమించాలి: బీఆర్ఎస్వీ
Hyderabad: ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఈ1, డీ, ఈ2 వసతి గృహాల కూల్చివేత యత్నాలు విరమించి, విద్యుత్, నీరు పునరుద్ధరించాలని బీఆర్ఎస్వీ నేత కొంపెల్లి నరేష్ డిమాండ్ చేశారు.
Hyderabad: ఓయూలో వసతి గృహాల కూల్చివేత యత్నాలను విరమించాలి: బీఆర్ఎస్వీ
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు ఆశ్రయంగా ఉన్న ఈ1, డీ, ఈ2 తదితర వసతి గృహాలకు విద్యుత్, నీటి సరఫరా నిలిపివేసి, వాటిని కూల్చివేసేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంపెల్లి నరేష్ డిమాండ్ చేశారు.
అధికారుల చర్యలతో విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ చర్యలను ఓయూ న్యాయ విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. విశ్వవిద్యాలయ అధికారులు తక్షణమే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని విద్యుత్, నీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరారు.
లేనిపక్షంలో విద్యార్థులు, నిరుద్యోగులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ మేరకు తమ నిరసనను తెలియజేస్తూ చీఫ్ వార్డెన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఓయూ బీఆర్ఎస్వీ నాయకులు నాగరాజు, సురేష్, రోహన్, సతీష్, శ్రవణ్, అరుణ్, మల్లేష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.




