Hyderabad: వినాయక హిల్స్‌లో శ్రీ త్రివేణి స్కూల్‌లో ఘనంగా ఇన్వెస్టిచర్ వేడుక

Hyderabad: అల్మాస్గూడ శ్రీ త్రివేణి స్కూల్‌లో విద్యార్థి నాయక మండలి ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ పి. నాగభూషణం. విద్యార్థులకు కీలక సూచనలు.

RAHUL, MEERPET
Published on: 11 July 2026 2:43 PM IST
Hyderabad
X

Hyderabad: వినాయక హిల్స్‌లో శ్రీ త్రివేణి స్కూల్‌లో ఘనంగా ఇన్వెస్టిచర్ వేడుక

హైదరాబాద్: మహేశ్వరం నియోజకవర్గం బడగ్పేట్ సర్కిల్ అల్మాస్గూడ వినాయక హిల్స్ లోని శ్రీ త్రివేణి స్కూల్, క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి ఎన్నికైన విద్యార్థి నాయక మండలి (స్టూడెంట్ కౌన్సిల్) బాధ్యతల స్వీకార కార్యక్రమం (ఇన్వెస్టిచర్ వేడుక) ఘనంగా నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ పి. నాగభూషణం నూతన విద్యార్థి నాయకులకు బ్యాడ్జీలు, సాష్‌లు, జెండాలను అందజేసి బాధ్యతలను అప్పగించారు.అనంతరం విద్యార్థులు ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ నాయకత్వం, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన ప్రవర్తన, సమాజ సేవ ప్రతి విద్యార్థి అలవర్చుకోవాల్సిన విలువలని అన్నారు. మొబైల్ ఫోన్లు, డిజిటల్ పరికరాల అధిక వినియోగానికి దూరంగా ఉండాలని, మాదకద్రవ్యాలు, ఇతర వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించాలని సూచించారు.

శ్రీ త్రివేణి స్కూల్ చైర్మన్, డైరెక్టర్ కె. గోవర్ధన్ రెడ్డి, కరస్పాండెంట్ టి. రాఘవేంద్ర రెడ్డి నూతన విద్యార్థి నాయకులను అభినందిస్తూ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆకాంక్షించారు.

నాయకత్వ అవకాశాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, బాధ్యతాయుతమైన ఆలోచన, సేవాభావం, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రవ్య, పీఈటీ బి. మనోహర్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

RAHUL, MEERPET

RAHUL, MEERPET

Next Story