Kapra: విజయ హైస్కూల్ విద్యార్థుల జయకేతనం.. టాపర్లకు ఎమ్మెల్యే బహుమతులు!

Kapra: కాప్రా విజయ హైస్కూల్‌ పదవ తరగతి విద్యార్థుల విజయదుందుభి. టాపర్లకు నగదు పురస్కారాలు అందజేసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి.

ASHOK, KAPRA
Published on: 7 Jun 2026 3:17 PM IST
Kapra
X

Kapra: విజయ హైస్కూల్ విద్యార్థుల జయకేతనం.. టాపర్లకు ఎమ్మెల్యే బహుమతులు!

Kapra: విజయ హైస్కూల్ ఆదిత్య నగర్ కాప్రాలో పదవ తరగతి విద్యార్థులు ఫలితాల ప్రభంజనం సృష్టించిన తరుణంలో విజయోత్సవ సభను పాఠశాల యాజమాన్యం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి విద్యార్థులను ఉద్దేశించి ఆశీర్వచనాలను అందిస్తూ..విజయ హై స్కూల్లో అభ్యసించిన విద్యార్థులు భవిష్యత్తులో సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. విద్యలో ఉత్తమప్రతిభను కనబరచిన ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకుతన వంతు అన్ని రకాలుగా సహాయసహకారాలను అందిస్తానని పేర్కొన్నారు.

అనంతరం ఉత్తమ ఫలితాలు పాఠశాల టాపర్ గా నిలిచిన సాహితీ - 584 మార్కులు ఎమ్మెల్యే చేతుల మీదుగా 10,000 రూపాయలను, 2nd మేఘనాలహరి - 582 మార్కులు 7500రూపాయలు, 3rd వరునిక - 579 మార్కులు 5000 రూపాయలతో పాటు శాలువ, మెమంటోలతో సత్కరించారు. 500మార్కులకు పైగా సాధించిన విద్యార్థులు 92 మందికి జ్ఞాపికలు, శాలువాలతో యాజమాన్యం ఘనంగా సన్మానించారు.

పాఠశాల చైర్మన్ కొప్పునూరి బసప్ప మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో దేశౌన్నత్యాన్ని చాటుతూ దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలని కోరారు. ఇంతటి ఫలితాలు సాధించడానికి కారకులైన ఉపాధ్యాయుల కృషిని అభినందించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ జనార్ధన్ రెడ్డి, సీనియర్ మైనారిటీ కాప్రా ప్రెసిడెంట్ బద్రుద్దీన్, కాప్రా టీఆర్ఎస్ యూత్ లీడర్ నరేష్ గౌడ్, ఆర్ ఎస్ యూత్ లీడర్ మహేష్ గౌడ్,పాఠశాల చైర్మన్ కొప్పునూరి బసప్ప,వ్యవస్థాపకురాలు శ్రీమతి విజయలక్ష్మి, విజయ ఎడ్యుకేషనల్ సొసైట్ వైస్ ప్రెసిడెంట్ శెట్టి చంద్రశేఖర్, పాఠశాల సభ్యులు రాజశేఖర్ ప్రభు, కరస్పాండెంట్ కొప్పునూరి రాజేశ్వర్, డైరెక్టర్ కొప్పునూరి వీణ, ప్రిన్సిపాల్ డి.వి.బాబు, ప్రధానోపాధ్యాయురాలు అద్దంకి పద్మావతి, ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA

Next Story