Hyderabad: సీపీ వీసీ సజ్జనార్ ఆకస్మిక బదిలీ సరికాదు: రాజనాల శ్రీహరి

Hyderabad: హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్‌ను 14 నెలలకే ఆకస్మికంగా బదిలీ చేయడం సరికాదని, వెంటనే ఆపివేయాలని గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ నేత రాజనాల శ్రీహరి డిమాండ్ చేశారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 13 Nov 2026 11:32 PM IST
Hyderabad
X

Hyderabad: సీపీ వీసీ సజ్జనార్ ఆకస్మిక బదిలీ సరికాదు: రాజనాల శ్రీహరి

హైదరాబాద్: హైదరాబాద్ పోలీస కమిషనర్ గా 14 నెలలకే బదిలీ చేయడం ప్రభుత్వం సరైన నిర్ణయం కాదని రాజనాల డిమాండ్ చేశారు 1996లో కడప పులివెందులలో ఫ్యాక్షనిస్టులను ఎదుర్కోవడంలో తనదైన శైలిలో ముద్రవేశారు జనగామలో ఐఏఎస్ఐ తీవ్రవాది వికారుద్దీన్ ఎన్కౌంటర్లో కీలకపాత్ర పోషించి మెదక్ ఫారెస్ట్ కర్ర స్మగ్లర్లు అంతం చేసి మంచి పేరున్న వి సి సజ్జనర్ గారు 2007లో కాశిబుగ్గ ఒక బాలిక మర్డర్ అయినప్పుడు ఆ క్రిమినల్ నీ చేదించడంలో విజయం సాధించాడు.

2008 వరంగల్ ఎస్పీగా ఉన్నప్పుడు కిడ్స్ కాలేజ్ చెందిన స్వప్న, ప్రశాంతి, యాసిడ్ దాడి కేసులో నిందితులను శ్రీనివాస్ సంజయ్ హరికృష్ణ లను శిక్షించి ప్రజలకు ఆడపిల్లలకు ధైర్యాన్ని కల్పించాడు ఆ ఎన్కౌంటర్ తో పోకిరిలు భయంతో ఇండ్లకే పరిమితమయ్యారు. ఎన్నో సమస్యలను తన ఒంటివేలుతో పరిష్కరించిన విశ్వనాధ్ చిన్నప్ప సజ్జనార గారిని వరంగల్ ప్రజలు మరువలేరు గంజాయి, దొంగతనం, డ్రగ్స్ ,నక్సలైట్లను, ఎదుర్కొన్న వ్యక్తిగా ప్రజల్లో మంచి పేరు ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందారు.

ఆర్టీసీ ఎండిగా ఆర్టీసీ కార్మికులకు సరియైన న్యాయం చేసి ఆర్టీసీకి మంచి లాభాల్లో వచ్చే విధంగా కృషి చేసిన వ్యక్తి హైదరాబాద్ సిపిగా మహిళా రక్షణ చిన్న పిల్లల రక్షణ మరో జన్మ అనే కార్యక్రమాలు చనిపోయిన వారి అవయవాలను దానం చేయాలి.

కార్యక్రమాన్ని చేపట్టిన వ్యక్తి ఆన్లైన్లో ,మోసాలు ,జాబు పేర్లతో మోసాలు, అధిక వడ్డీ మోసాలు ఎప్పటికప్పుడు ఎండబెట్ట నా వ్యక్తి హైదరాబాదులో ఆటో డ్రైవర్లకు వన్ మినిట్ ట్రాఫిక్ కార్యక్రమంతో ట్రాఫిక్ నియంత్రణ చేసిన వ్యక్తి హైదరాబాద్లో గణపతి నిమర్జనం శోభయాత్ర లాంటి ఎన్నో కార్యక్రమాలకు లాండ్ ఆర్డర్ తో ఎన్నో సభలను ఆటంకం లేకుండా ట్రాఫిక్ అంతరాయం లేకుండా తనదైన శైలిలో సత్తా చూపిన వ్యక్తిగా విసి సర్జనార్ అటువంటి వ్యక్తిని అకస్మాత్తుగా బదిలీ సరైనది కాదని గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి డిమాండ్ చేశారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.