Hyderabad: మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి.. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

Hyderabad: మహిళల ఆర్థిక స్వావలంబనకు కుట్టుశిక్షణ కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయని ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 15 Jun 2026 3:20 PM IST
Hyderabad
X

Hyderabad: మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి.. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

హైదరాబాద్: లింగోజిగూడా డివిజన్ పరిధిలోని మైత్రి నగర్‌లో గతంలో కుట్టుశిక్షణ పొందిన మహిళల సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా మహిళలకు ఉచితంగా కుట్టుశిక్షణ అందించేందుకు ముందుకు వచ్చిన బండి ప్రభావతి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ ఒక గొప్ప అవకాశమని, దీని ద్వారా ప్రతి మహిళ స్వయం ఉపాధి పొందడంతో పాటు ఎక్కడైనా ఉపాధి అవకాశాలను సృష్టించుకోగలదని పేర్కొన్నారు. శిక్షణ పూర్తయిన అనంతరం అందించే సర్టిఫికెట్ ద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

కుట్టుశిక్షణ ద్వారా మహిళలు తమ కుటుంబ అవసరాలకు తోడ్పడడమే కాకుండా ఆర్థిక స్వావలంబన సాధించి మహిళా సాధికారత దిశగా ముందుకు సాగగలరని అన్నారు. ఒక మహిళ స్వంతంగా సంపాదించగలిగితే కుటుంబంలో, సమాజంలో ఆమె గౌరవం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.

మహిళలకు ఉపాధి కల్పించే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ఆనందదాయకమని తెలిపారు. అనంతరం కుట్టుశిక్షణ పూర్తి చేసిన మహిళలు స్వయంగా కుట్టిన దుస్తులను ఎమ్మెల్యే పరిశీలించారు. అలాగే జయచంద్ర రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన మహిళలకు ఒక పీకో మిషన్ అందజేయడం జరిగింది.

ఈ పీకో మిషన్ ద్వారా మహిళలు అదనపు ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే వివరించారు. ఈ సందర్భంగా లింగోజిగూడ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు తిలక్ రావు తన వంతు సహాయంగా మరో పీకో మిషన్ అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తోట రాజశేఖర రెడ్డి, శ్రీధర్, ట్రైనర్ కళావతి తదితరులు పాల్గొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story