Quthbullapur: భార్యతో గొడవ పడితే స్తంభానికి కట్టేసి చంపేశారు

Quthbullapur: భార్యతో గొడవ పడుతున్నాడనే నెపంతో సునీల్ రామ్ అనే కూలీని సైట్ ఇంజనీర్, మరో నలుగురు వ్యక్తులు కలిసి స్తంభానికి కట్టేసి చిత్రహింసలకు గురిచేశారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 2 May 2026 12:07 PM IST
Quthbullapur
X

Quthbullapur: భార్యతో గొడవ పడితే స్తంభానికి కట్టేసి చంపేశారు

కుత్బుల్లాపూర్: బొమ్మ శ్రీధర్ స్తంభానికి కట్టేసి ప్రాణం తీశారు నిర్మాణ స్థలంలో కూలీ దారుణ హత్య!

-పేట్ బషీరాబాద్ లో అమానుషం..భార్యతో గొడవ పడుతున్నాడని చిత్రహింసలు -సైట్ ఇంజనీర్, మరో నలుగురు కూలీల అత్యుత్సాహం.. ఒకరి బలి నగరంలోని కుత్బుల్లాపూర్ పరిధిలో అత్యంత అమానుష ఘటన చోటుచేసుకుంది. చిన్నపాటి గొడవను సర్దిచెప్పాల్సిన వారే.. రాక్షసంగా మారి ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నారు. పనమ్మాయిల మధ్య గొడవను సాకుగా చూపి, ఓ కూలీని రాత్రంతా స్తంభానికి కట్టేసి చిత్రహింసలకు గురిచేయడంతో అతను ప్రాణాలు విడిచిన ఘటన పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సునీల్ రామ్ (35) తన భార్యతో కలిసి కుత్బుల్లాపూర్, గోదావరి హోమ్స్ సమీపంలోని 'పామీరా మెడోస్ ఫ్రైడ్ ఇన్ఫ్రా' నిర్మాణ స్థలంలో కూలీగా పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నాడు. ఏప్రిల్ 30వ తేదీ రాత్రి సుమారు 10 గంటల సమయంలో సునీల్ రామ్ తన భార్యతో వ్యక్తిగత విషయాల పై గొడవ పడుతున్నాడు అయితే, గొడవ పెద్దది కావడంతో అక్కడ న్యూసెన్స్ జరుగుతోందని భావించిన సైట్ ఇంజనీర్ ప్రసాద్, మరో నలుగురు కూలీలు కలిసి జోక్యం చేసుకున్నారు.

కట్టేసి.. చిత్రహింసలు పెట్టి.. పరిస్థితిని చక్కదిద్దాల్సింది పోయి, వారు అత్యుత్సాహం ప్రదర్శించారు. సునీల్ రాము బలవంతంగా పట్టుకుని, తీవ్రంగా కొడుతూ నిర్మాణంలో ఉన్న భవనం వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఉన్న ఒక సిమెంట్ స్తంభానికి కొబ్బరి తాడుతో అతన్ని బంధించారు. అంతటితో ఆగకుండా, తీవ్ర గాయాలపాలైన సునీల్ రామ్ను అదే స్థితిలో రాత్రంతా వదిలేసి వెళ్లిపోయారు.

ఉదయాన్నే విగతజీవిగా... శుక్రవారం (మే 1) ఉదయం 9 గంటల సమయంలో సునీల్ భార్య వెళ్లి చూడగా, అతను స్పృహ లేకుండా పడి ఉన్నాడు. పరిశీలించగా అప్పటికే సునీల్ మృతి చెందినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. రాత్రంతా కట్టేయడం వల్ల గాయాలు, సరైన వైద్యం అందకపోవడంతోనే సునీల్ మరణించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. పోలీసుల రంగ ప్రవేశం

సమాచారం అందుకున్న వెంటనే పెట్ బషీరాబాద్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (హనూ) తన బృందంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పంచనామా నిర్వహించిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన సైట్ ఇంజనీర్ ప్రసాద్ పాటు మరో నలుగురు కూలీలపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను తీసుకునేందుకు ప్రత్యేక రంగంలోకి దిగాయి.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story