Madugula: దొడ్లపహాడ్‌లో ఘనంగా వీరనాగమ్మ మండల పూజ!
Madugula: దొడ్లపహాడ్‌లో వీరనాగమ్మ దేవత మండల పూజా మహోత్సవంలో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పాల్గొన్నారు.
Madugula: దొడ్లపహాడ్‌లో ఘనంగా వీరనాగమ్మ మండల పూజ!
మాడుగుల: రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం, దొడ్లపహాడ్ గ్రామంలో నూతనంగా విగ్రహ ప్రతిష్టాపన పూర్తి చేసుకున్న వీరనాగమ్మ దేవత ఆలయంలో 41 రోజుల పూజా కార్యక్రమం పూర్తయిన సందర్భంగా ఘనంగా నిర్వహించిన మండల పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఐక్యత ఫౌండేషన్ చైర్మన్,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు& TASK-C.O.O సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి * ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని,అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది.
గ్రామ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్న వీరనాగమ్మ దేవత ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారంగా రూ.1,80,000/- (ఒక లక్ష ఎనభై వేల రూపాయలతో) పెయింటింగ్ పనులు పూర్తి చేయడం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో ఆలయాలు ప్రజల విశ్వాసాలు, సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని,గ్రామాల్లో ఆలయాల అభివృద్ధి కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మాత్రమే కాకుండా,గ్రామ ప్రజలందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చే ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు,నాగమ్మ దేవత ఆలయంలో నిర్వహించిన మండల పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందడం ఎంతో ఆనందంగా ఉందని, దొడ్లపహాడ్ గ్రామ ప్రజలకు నాగమ్మ దేవత అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, భక్తులు, గ్రామస్థులు తదితరులు పాల్గొని రాఘవేందర్ రెడ్డి స్వాగతం పలికారు,ఆలయ అభివృద్ధికి రూ.1.80 లక్షలతో పెయింటింగ్ పనులు పూర్తి చేసి సహకారం అందించినందుకు గ్రామస్థులు, ఆలయ నిర్వాహకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, ఎల్లప్పుడూ అమ్మవారి ఆశీస్సులతో భవిష్యత్ లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరుకుంటున్నామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మట్ట నాగయ్య మట్ట యాదయ్య, అర్జున్,మల్లేష్,శ్రీను.మల్లేష్, శంకర్, రాజు, నాగరాజు,వెంకటేష్,నాగరాజు, సురేష్,సత్తయ్య,యాదగిరి,నాగేష్ లతో పాటు గ్రామస్తులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




