Madugula: పకీర తండాలో రూ.1.50 లక్షలతో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం!
Madugula: మాడుగుల మండలం పకీర తండాలో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి రూ. 1.50 లక్షలతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు.
Madugula: పకీర తండాలో రూ.1.50 లక్షలతో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం!
మాడుగుల: మాడుగుల మండలం, పకీర తండాలో..ఐక్యత ఫౌండేషన్ సహకారంతో.. రూ. 1,50,000/- (ఒక లక్ష యాభై వేల రూపాయలతో) ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు & TASK-C.O.O సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.
అలాగే తండా ఘనంగా నిర్వహించిన సీత్ల భవానీ పండుగ వేడుకల్లో ప్రజలతో కలిసి పాల్గొన్న సుంకిరెడ్డి ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ “స్వచ్ఛమైన త్రాగునీరు అనేది సౌకర్యం మాత్రమే కాకుండా,ప్రతి మనిషి ఆరోగ్యవంతమైన జీవితానికి ప్రాథమిక అవసరం, మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు త్రాగునీటి కోసం ఇబ్బందులు పడటం బాధాకరం, అందుకే ప్రతి తండా.. ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన, రక్షిత త్రాగునీరు అందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నాం,” అని తెలిపారు.
పకీర తండా ప్రజలు త్రాగునీటి సమస్యను తన దృష్టికి తీసుకువచ్చిన వెంటనే స్పందించి, ఐక్యత ఫౌండేషన్ సహకారంతో రూ.1.50 లక్షలతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. “ఒక ప్రాంతం అభివృద్ధి చెందిందంటే కేవలం రోడ్లు, భవనాలు నిర్మించడం మాత్రమే కాదు.. అక్కడి ప్రజలకు ఆరోగ్యకరమైన జీవితం అందించడమే నిజమైన అభివృద్ధి, అందులో స్వచ్ఛమైన త్రాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఉంది” అని అన్నారు,
“పకీర తండాతో పాటు నియోజకవర్గంలోని ప్రతి మారుమూల తండాకు,గ్రామానికి స్వచ్ఛమైన త్రాగునీరు అందేలా మా వంతు కృషి చేస్తాం, ప్రజలకు అవసరమైన చోట సేవ చేయడం.. మాట ఇవ్వడం మాత్రమే కాకుండా, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే మా లక్ష్యం” అని సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి స్పష్టం చేశారు,
గిరిజన తండాల అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ కొనసాగుతుందని,ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో ఐక్యత ఫౌండేషన్ ముందుంటుందని తెలిపారు, త్రాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతులు వంటి ప్రజలకు అవసరమైన సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని పేర్కొన్నారు.
అలాగే తండాలో నిర్వహించిన సీత్ల భవానీ పండుగ వేడుకలకు నన్ను ఆహ్వానించి ఇంత గొప్ప స్వాగతం పలికిన తండా ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ..
మన సంస్కృతి,సంప్రదాయాలు మన సమాజానికి గొప్ప వారసత్వమని, వాటిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు, తండా ప్రజలతో కలిసి సీత్ల భవానీ పండుగలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని, ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుతూ,ప్రజల సంతోషంలో భాగస్వామి కావడం తనకు ఎంతో సంతోషాన్నించిందని
తండా ప్రజల అభివృద్ధి, సంక్షేమంతో పాటు వారి సంస్కృతి, సంప్రదాయాలకు తనవంతు ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు.
నీటిశుద్ధి కేంద్రం ఏర్పాటు సందర్భంగా తండావాసులు మాట్లాడుతూ తమ త్రాగునీటి సమస్యను గుర్తించి వెంటనే స్పందించి మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
త్రాగునీటి సమస్యతో ఎన్నో ఇబ్బందులు పడుతున్న తమకు ఇప్పుడు స్వచ్ఛమైన త్రాగునీరు అందుబాటులోకి రావడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని శుద్ధమైన త్రాగునీటి సౌకర్యం కల్పించిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ శారద శ్రీను, ఉప రాజేందర్ నాయక్, మాజీ సర్పంచ్ పద్మ జగదీష్, వార్డు సభ్యులు బుజ్జి, రవి, లచ్చి,మాజీ వార్డు సభ్యులు భీక్య,రాజు, బీక్కి లతో పాటు మాడుగుల ఐక్యత ఫౌండేషన్ ఇంచార్జి సూదిని జైపాల్ రెడ్డి మరియు తండా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




