Talakondapally: వెల్జాల్ మైసమ్మ బోనాల్లో పాల్గొన్న సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి
Talakondapally: తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామంలో నిర్వహించిన రామాసిపల్లి మైసమ్మ బోనాల ఉత్సవాల్లో కాంగ్రెస్ నేత సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పాల్గొన్నారు.
Talakondapally: వెల్జాల్ మైసమ్మ బోనాల్లో పాల్గొన్న సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి
రంగారెడ్డి జిల్లా: తలకొండపల్లి మండలం, వెల్జాల్ గ్రామంలో.. రామాసిపల్లి మైసమ్మ తల్లి బోనాల ఉత్సవాలను గ్రామ ప్రజలు, భక్తులు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు & టాస్క్ సి.ఓ.ఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మైసమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆశీస్సులు పొందారు, అనంతరం సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ..
ప్రతి గ్రామంలో ఆధ్యాత్మికతతో పాటు ఐక్యత, సోదరభావం పెంపొందించేలా ఇలాంటి పండుగలు ఎంతో ముఖ్యమని తెలిపారు, ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, మైసమ్మ తల్లి ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో.. స్థానిక ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, బోనాల ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




