Kalwakurthy: దైవభక్తితోనే సామాజిక మార్పు.. సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి!

Kalwakurthy: ఆమనగల్ మున్సిపాలిటీ విఠాయిపల్లి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి. ఆధ్యాత్మికత, సేవాభావంపై ఆయన చేసిన వ్యాఖ్యలు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 25 April 2026 11:40 AM IST
Kalwakurthy
X

Kalwakurthy: దైవభక్తితోనే సామాజిక మార్పు.. సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి!

Kalwakurthy: రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని విఠాయిపల్లి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న. సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి. ఈరోజు నియోజకవర్గ పర్యటనలో భాగంగా.. ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని విఠాయిపల్లి హనుమాన్ దేవాలయాన్ని సందర్శించిన. ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు &TASK-C.O.O సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి. ఆలయంలో నిర్వాహకులు ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

తదనంతరం మాట్లాడుతూ..

ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని,ఆధ్యాత్మికత మనిషికి ధైర్యాన్ని, సేవాభావాన్ని పెంపొందిస్తుందని, సమాజంలో సానుకూల మార్పులకు దైవభక్తి ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ భావోజి లక్ష్మణ్ నాయక్, స్థానిక నాయకులు రచ్చ శ్రీరాములు, రూపం వెంకట్ రెడ్డి, శేఖర్, వెంకటేష్, గాజుల శ్రీను లతో పాటు ఐక్యత ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story