Hyderabad: కేబీఆర్ పార్క్ చుట్టూ చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే!
Hyderabad: హైదరాబాద్‌లోని ప్రసిద్ధ కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న పర్యావరణ సున్నిత ప్రాంతం (ESZ) పరిధిలో చెట్లను నరకడంపై సుప్రీంకోర్టు కీలక స్టే విధించింది.
Hyderabad: కేబీఆర్ పార్క్ చుట్టూ చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే!
Hyderabad: కేబీఆర్ పార్కు చుట్టూ 25 నుండి 35 మీటర్ల మీద ఉండే ఈ ఎస్ జెడ్ పరిధిలో చెట్లను నరకడంపై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం స్టే విధించింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పర్యావరణ ప్రేమికురాలు కాజల్ మహేశ్వరి ఈ మేరకు విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఇదే విషయంపై మద్యంతర ఉపశమనం కల్పించడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరణను సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టు కు వెళ్లినట్లు తెలియజేశారు.
తన న్యాయవాది కే వివేక్ రెడ్డి వాదనలు విన్న సుప్రీంకోర్టు కె.బి.ఆర్ జాతీయ ఉద్యానవనం చుట్టూ ఉన్న పర్యావరణ సున్నిత ప్రాంతం వెడల్పును 29.8 మీటర్ల పరిధికి తగ్గించడంపై సవాలు చేసిన ఆమె వాదనలు విన్న ధర్మాసనం ఈ మేరకు మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం పర్యావరణ సంరక్షణకు గండి కొడుతూ అనేక ఉల్లంఘనలకు పాల్పడుతుందని దీనివల్ల వాతావరణంలో చోటు చేసుకునే అనేక మార్పులు భవిష్యత్తులో ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తాయని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో పర్యావరణవేత్త మాజీ సైనికుడు మేజర్ సందీప్ కురానా, అనేకమంది పర్యావరణ ప్రేమికులు పాల్గొన్నారు.




