Rayadurgam: సైబర్ నేరాలపై జూనియర్ కళాశాల విద్యార్థులకు అవగాహన!

Rayadurgam: 'సురక్ష కా తిరంగా' కార్యక్రమంలో భాగంగా రాయదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.

VISHWANATH, SHERILINGAMPALLY
Published on: 20 Aug 2026 5:39 PM IST
Rayadurgam
X

Rayadurgam: సైబర్ నేరాలపై జూనియర్ కళాశాల విద్యార్థులకు అవగాహన!

రాయదుర్గం: విద్యార్థులకు సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో 'సురక్ష కా తిరంగా' కార్యక్రమంలో భాగంగా రాయదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం సైబర్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాయదుర్గం డిఐ కె. రామిరెడ్డి, సెక్టార్ ఎస్ఐ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

సదస్సులో సుమారు 350 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ... ప్రస్తుత డిజిటల్ యుగంలో రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాలు, ఆన్‌లైన్ ఆర్థిక మోసాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియా వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యక్తిగత సమాచార భద్రత మరియు సైబర్ రక్షణ చర్యలను వివరించారు.

ఏదైనా సైబర్ మోసం జరిగిన వెంటనే బాధితులు జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ *1930*ను ఆశ్రయించాలని, దీనివల్ల పోగొట్టుకున్న డబ్బును త్వరగా రికవరీ చేసే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. విద్యార్థులు ఈ విషయాలపై అవగాహన పెంచుకోవడంతో పాటు తోటివారికి కూడా అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.

VISHWANATH, SHERILINGAMPALLY

VISHWANATH, SHERILINGAMPALLY

Next Story