Quthbullapur: కొలన్ హన్మంత్ రెడ్డిని కలిసిన లక్ష్మి నగర్ నూతన కమిటీ
Quthbullapur: సూరారం లక్ష్మి నగర్ కాలనీ నూతన కమిటీ సభ్యులు కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డిని కలిశారు. నూతన బాధ్యులకు హన్మంత్ రెడ్డి సత్కారం.
Quthbullapur: కొలన్ హన్మంత్ రెడ్డిని కలిసిన లక్ష్మి నగర్ నూతన కమిటీ
కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారంలోని లక్ష్మి నగర్ (ఓనర్స్ అసోసియేషన్)కు నూతనంగా ఎన్నికైన కాలనీ అధ్యక్షులు అమృత్ రెడ్డి, జనరల్ సెక్రటరీ శంకర్ రావు, ట్రెజరర్ సాయి ప్రేమ్‌లు ఈరోజు బాచుపల్లిలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.
అనంతరం కొలన్ హన్మంత్ రెడ్డి నూతన కమిటీ సభ్యులను శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కాలనీ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి సమిష్టిగా కృషి చేసి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పాల కృష్ణ, మైసి శ్రీనివాస్, కాలనీ వాసులు యూ. ప్రభులింగం, ఈ. సురేష్, బి. శ్రీనివాస్, నవీన్, కామేశ్వర రావు, ప్రసాద్ రెడ్డి, రాధిక, త్రివేణి తదితరులు పాల్గొన్నారు.




