Malkajgiri: నేరేడ్‌మెట్‌లో ఘనంగా సూర్యభగవానుడి విగ్రహ ప్రతిష్ఠాపన!
Malkajgiri: కాశీ విశ్వనాథ ఆలయంలో పుష్పగిరి పీఠాధీశ్వరులు విద్యాశంకర భారతి స్వామి చేతుల మీదుగా సూర్యభగవానుడి విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది.
Malkajgiri: నేరేడ్‌మెట్‌లో ఘనంగా సూర్యభగవానుడి విగ్రహ ప్రతిష్ఠాపన!
మల్కాజిగిరి: నేరేడ్‌మెట్‌లోని శ్రీ అన్నపూర్ణ సహిత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో సూర్యభగవానుడి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణల నడుమ పుష్పగిరి పీఠాధీశ్వరులు అభినవోద్దండ విద్యాశంకర భారతి స్వామి చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం వైభవంగా జరిగింది.
ఈ సందర్భంగా ఆలయంలో శివపార్వతులకు ప్రత్యేక అభిషేకాలు, అమ్మవారికి సహస్ర కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం పీఠాధీశ్వరులు భక్తులకు ఆశీర్వచనాలు అందించారు.
కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సూర్యభగవానుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు.
Next Story




