Pargi: పరిగిలో వైన్ షాప్ ముందు వ్యక్తి అనుమానాస్పద మృతి!

Pargi: వికారాబాద్ జిల్లా పరిగి బహార్‌పేట వైన్ షాప్ వద్ద యాదయ్య అనే మెకానిక్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

WAZID, PARIGI
Published on: 6 Sept 2026 9:45 AM IST
Pargi
X

Pargi: పరిగిలో వైన్ షాప్ ముందు వ్యక్తి అనుమానాస్పద మృతి!

Pargi: వికారాబాద్ జిల్లా పరిగిలో వైన్ షాప్ ముందు వ్యక్తి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. పరిగి బహార్‌పేట చౌరస్తాలోని ఓ వైన్ షాప్ ముందు ఓ వ్యక్తి మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

మృతుడిని పూడూరు మండలం గొంగుపల్లికి చెందిన యాదయ్యగా పోలీసులు గుర్తించారు. యాదయ్య స్థానికంగా ఓ మెకానిక్ షాపులో పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

అయితే యాదయ్య మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆయన సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఇదిలా ఉంటే పరిగిలో నెలరోజుల వ్యవధిలో మద్యం మత్తులో ఇది రెండో మరణం కావడం చర్చనీయాంశంగా మారింది. నెలరోజుల క్రితం గాంధీ చౌక్ సమీపంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో మృతి చెందిన ఘటన మరవకముందే తాజాగా బహార్‌పేట చౌరస్తాలో వైన్ షాప్ ముందు మరో వ్యక్తి మృతిచెందడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది.

నిబంధనల అమలు విషయంలో ఎక్సైజ్ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారా? వరుస ఘటనలపై అధికారులు స్పందించి, అసలు కారణాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.

WAZID, PARIGI

WAZID, PARIGI