Dundigal: అనుమానంతో ఘోరం.. నిద్రిస్తున్న భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త!

Dundigal: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాగిల్లాపూర్‌లో ఘోరం జరిగింది.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 7 Jun 2026 7:48 AM IST
Dundigal
X

Dundigal: అనుమానంతో ఘోరం.. నిద్రిస్తున్న భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త!

దుండిగల్: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమనంతో భార్యను భర్త అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. దుండిగల్ సర్కిల్ గాగిల్లాపూర్ చర్చి కి సమీపంలో నివాసం ఉంటున్న సంతోష్ కుమార్ చారి (44), సంతోష (38) దంపతులకు 21 ఏళ్ల క్రితం వివాహ మైంది.

వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అయితే గత కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న సంతోష్ కుమార్ గత రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సంతోష తలపై గొడ్డలితో బలంగా బాది హత్య చేశాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించినట్లు దుండిగల్ సీఐ పి. సతీష్ తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని రిమాండ్కు తరలించారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story