Madhapur: సీఎంసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చెత్త సేకరణ కార్మికుల ముట్టడి

Madhapur: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని తెలంగాణ స్వచ్ఛ ఆటో కార్మికులు ముట్టడించి రాంకీ, సీఎంసీ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.

VISHWANATH, SHERILINGAMPALLY
Published on: 11 Aug 2026 1:46 PM IST
Madhapur
X

Madhapur: సీఎంసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చెత్త సేకరణ కార్మికుల ముట్టడి

Madhapur: మాదాపూర్‌లోని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) కార్యాలయం వద్ద మంగళవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ స్వచ్ఛ ఆటో మరియు రిక్షా కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మంది చెత్త సేకరణ కార్మికులు సీఎంసీ కార్యాలయాన్ని ముట్టడించారు.

కార్మికులు లోపలికి వెళ్లకుండా పోలీసులు ప్రధాన గేటు వద్ద అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య నెట్టివేత చోటుచేసుకుంది. ఈ సందర్భంగా రాంకీ సంస్థకు వ్యతిరేకంగా కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పరిసర ప్రాంతాలను హోరెత్తించారు.

సీఎంసీ కమిషనర్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు తమ జీవనోపాధిని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. 'స్వచ్ఛ సీఎంసీ' పేరిట చెత్త పన్నును ఆస్తిపన్నుతో కలిపి వసూలు చేయడం వల్ల తమకు దక్కాల్సిన ప్రాథమిక ఆదాయం దక్కకుండా పోతోందని మండిపడ్డారు.

కార్మికుల ముఖ్య డిమాండ్లు:

* తమను పాత పద్ధతిలోనే యథాస్థితిలో పారిశుద్ధ్య పనుల్లో కొనసాగించాలి.

* ఆస్తిపన్నుతో కలిపి చెత్త పన్ను వసూలు చేసే విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి.

* ఎలక్ట్రికల్ (ఈ-ఆటోల) పేరుతో కొత్త ఆటోలను ప్రవేశపెట్టి తమ పొట్ట కొట్టొద్దు.

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని కార్మిక సంఘం నాయకులు హెచ్చరించారు.

VISHWANATH, SHERILINGAMPALLY

VISHWANATH, SHERILINGAMPALLY

Next Story