Hyderabad: కల్లును స్టేటస్ సింబల్ చేయాలనుకున్నా.. కానీ నెగిటివ్ చేశారు

Hyderabad: టాడి మ్యూజికల్ ఫెస్టివల్' రద్దు చేసినట్లు ఎక్స్ పీరియం ఎకో పార్కు ఫౌండర్ రాందేవ్ రావు ప్రకటన.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 22 May 2026 4:48 PM IST
Hyderabad
X

Hyderabad: కల్లును స్టేటస్ సింబల్ చేయాలనుకున్నా.. కానీ నెగిటివ్ చేశారు

Hyderabad: ప్రకృతిపై అపార మైన ప్రేమ, గ్రామీణ సంస్కృతిపై ఉన్న గౌరవంతోనే 'టాడి మ్యూజికల్ ఫెస్టివల్ ఎక్స్ పీరియం-2026ను నిర్వహించాలనే ఆలోచన చేశాం తప్ప, ఇందులో ఎలాంటి వ్యాపార కోణం కానీ, స్వలాభం కానీ లేదని ఎక్స్పిరియం ఎకో పార్కు ఫౌండర్ రాందేవ్ రావు స్పష్టం చేశారు. సమాజంలో కొందరు వ్యక్తులు ఈ ఫెస్టివల్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎవ దీని వ్యక్తిగతంగా విమర్శించకుండా, ఎవరి మనోభావాలను గాయపరచకుండా, తన ఆలోచనల వెనుక ఉన్న నిష్కల్మషమైన ఆశయాన్ని ఆయన వివరించారు.

సమాజంలో అనవసర వివా దాలకు తావు ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ఈ 'టాడి ఫెస్టివల్'ను రద్దు చేసుకుంటున్నట్లు శుక్రవారం మీడియా సమావేశంలో రాందేవ్ రావు ప్రకటించారు. ఈ రద్దు నిర్ణయం వల్ల తమకు ఎలాంటి నష్టం లేదని, ప్రకృతిపై తమకున్న ప్రేమ ఎప్పటికీ తగ్గ దన్నారు. భవిష్యత్తులో కూడా పర్యావరణ పరిరక్షణ కోసం, ప్రకృతి వనాల అభివృద్ధి కోసం తమ వంతు కృషిని నిరంతరం కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.

కల్లుకు ప్రాచుర్యం కల్పించాలన్నదే ఉద్దేశం..

టాడి మ్యూజికల్ ఫెస్టివల్ ఎవరికీ వ్యతిరేకం కాదు. ఎవరి బిజినెస్ ని లాక్కోవడానికి కాదు. నేను నా ఇతర వ్యాపారాలను వదిలి గీత కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా ఈ టాడి మ్యూజికల్ ఫెస్టి వల్ నిర్వహించాలనుకున్నానని రాందేవ్ రావు వివరించారు. నేను ఒక గ్రీన్ లవర్ని కల్లు మీద ఉన్న అభిమానంతో తాటి చెట్లను కూడా కలెక్ట్ చేయడం జరిగిందని, దాదాపు 270 వెరైటీల తాటి చెట్లను ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి తెచ్చి, దాదాపు 10 కోట్లు వెచ్చించి, ఇండియాలో ఎవరి దగ్గర లేనన్ని చెట్లను తను సేకరించినట్లు గుర్తు చేశారు.

కల్లు మీద ఉన్న ప్రేమతో వివిధ దేశాల్లో స్టడీ చేశానని, తాటి సంబంధిత ప్రొడక్ట్స్ మార్కెట్ సిచు యేషన్ ఏంటి అని తెలుసుకుని ఇక్కడ కల్లుకు ప్రాచుర్యం కల్పిం చాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలనుకున్నానని తెలిపారు. ఇంత అభిమానం ఉన్న తనను కొందరు ఎందుకు నెగిటివ్ గా తీసుకున్నారో అర్థం కావడం లేదన్నారు. తాను గవర్నమెంట్ తో కుమ్మక్కయ్యానని కొత్త ట్విస్ట్ తెరపైకి తీసుకువచ్చారని, కల్లును ఇష్టపడే వ్యక్తిగా, కల్లుకు ప్రాచుర్యం కల్పించాలన్నదే నా ఉద్దేశమని, మరీ ముఖ్యంగా కల్లును ఒక స్టేటస్ సింబల్లా చేయాలని అనుకుంటున్నానని వివరించారు.

టాడి మ్యూజికల్ ఫెస్టివల్ ప్రకటన సందర్భంలో నేను కల్లు బిజినెస్ చేస్తానని ఎక్కడా అనలేదని స్పష్టం చేశారు.. ఇది రాష్ట్ర డ్రింక్ గా డిక్లేర్ చేయమని కూడా నేను అన్నానని. ఇందులో తప్పేముందన్నారు. ఒక ఎకరంలో ఈత చెట్లు, తాటి చెట్లు, జీళ్లు చెట్లు పెడితే గీత కార్మికులు ఫార్మింగ్ చేసుకోవచ్చని.. ప్రతి ఒక్కరూ చేస్తే వారి లైవ్లీహుడ్ బాగుంటుందన్నారు. కేవలం అభిమానంతో, గవర్న మెంట్ కు ఒక కనువిప్పు రావాలనే ఉద్దేశంతోనే తప్ప.. ఇందులో కొందరు ఈ కార్యక్రమాన్ని నెగిటివ్ చూడడాన్ని తీవ్రంగా రాందేవ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. టాడి ఫెస్టివల్ ఎవరికీ వ్యతిరేకం కాదు.

మారుతున్న కాలంతో పాటు గీత వృత్తిని, కల్లు అనుబంధ ఉత్ప త్తులను ఆధునీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాందేవ్ రావు చెప్పారు. తనపై నెగిటివ్ ప్రచారాలు చేసే వారు వాస్తవాలను గ్రహించుకోవాలని, తనపై ఉన్న ఆపోహలను, ప్రతికూల భావాలను తొలగించుకోవాలని, గీత కార్మికుల సంక్షేమానికి తన వంతు బాధ్యత పోషిస్తానని రాందేవ్రావు తెలిపారు. ఈ సంద ర్భంగా గ్రామీణ జీవన విధానంలో భాగమైన తాటి చెట్టు విశిష్ట తను నేటి తరానికి పరిచయం చేయాలనే సదుద్దేశంతోనే ఈ కార్యక్రమానికి చేపట్టాలనుకున్నానని రాందేవ్రావు చెప్పారు.

మానవ జీవన ప్రయాణంలో తాటి చెట్టు పాత్ర అనన్యసాన్యం. తాటి ఆకులతో ఇళ్లకు కప్పులు వేసుకోవడం, తాటి చాపలు, తాటి విసన కర్రలు, తాటి బుట్టలు చేయడం, తాటి ముంజలు వేస విలో ఇచ్చే చలువ, ఆరోగ్యం అమూల్యం తదితర అంశాలు మన సంస్కృతిలో భాగమని వివరించారు. తాటి చెట్టు వేరు నుంచి చివరి ఆకు వరకు ప్రతిదీ మానవాళికి ఉపయోగపడేదేనని, అలాంటి వృక్షసంపదను, గ్రామీణ కళలను గౌరవించాలనేదే ఆశ యంతో టాడి ఫెస్టివల్ చేపట్టి.. తద్వారా గీత కార్మికులకు అండగా తన వంతు బాధ్యతగా నిలవాలనుకున్నానని వివరించారు.

కల్లు వ్యాపారంతో సంపాదిస్తున్నానని.. నిరూపిస్తే రూ.కోటి ఇస్తా..

తాను కల్లు వ్యాపారం ద్వారా సొమ్ము సంపాదిస్తున్నానని లేదా ఆ వ్యాపారంలో భాగస్వామిగా ఉన్నానని ఎవరైనా నిరూపిస్తే, వారికి రూ. కోటి బహుమతిగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని రాందేవ్ రావు సవాల్ విసిరారు. పనిగట్టుకుని తనను టార్గెట్ చేస్తూ పాయింట్ అవుట్ చేస్తున్న వారు ఈ సవాల్ను స్వీకరించా లని, ఆధారాలు ఉంటే తన ముందుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో జరిగిన ఒక అధికారిక సమావేశంలో తాను కేవలం సంప్రదాయ వృత్తుల ప్రోత్సాహం, మార్కెటింగ్ కోణంలోనే కొన్ని సూచనలు చేశానని స్పష్టం చేశారు.

ఐదు నక్ష త్రాల (ఫైవ్ స్టార్) హోటళ్లతో పాటు అన్ని బార్లలో బీరుతో పాటు కల్లును కూడా అందుబాటులో ఉంచి విక్రయించేలా చర్యలు తీసుకోవాలని, దీనివల్ల స్థానిక గీత కార్మికులకు మేలు జరుగు తుందనే ఉద్దేశంతోనే ఆ ప్రతిపాదన చేశానని వివరించారు. ఈ భావనను తప్పుగా చిత్రీకరిస్తూ కొందరు రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 'నాకు సొంతంగా ఎలాంటి కల్లు వ్యాపారం లేదని, అందులో పెట్టుబ డులు కూడా లేవని స్పష్టం చేశారు. కేవలం గీత కార్మికుల సంక్షేమం కోసమే మాట్లాడాను తప్ప, నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదన్నారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA

Next Story