Talakondapalli: ప్రజాస్వామ్య పరిరక్షణకు ఢిల్లీ చేరిన తలకొండపల్లి కాంగ్రెస్

Talakondapalli: ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు రక్షణే ధ్యేయంగా నిర్వహించిన చలో ఢిల్లీ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నాయి.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 1 Nov 2026 3:20 PM IST
Talakondapalli
X

Talakondapalli: ప్రజాస్వామ్య పరిరక్షణకు ఢిల్లీ చేరిన తలకొండపల్లి కాంగ్రెస్

రంగారెడ్డి జిల్లా: తలకొండపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహించిన చలో ఢిల్లీ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు విలువను కాపాడాలనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ జెండాలతో తమ సంఘీభావాన్ని ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, లింగరావుపల్లి గ్రామ సర్పంచ్ కాసు శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ జనరల్ సెక్రటరీ, మాజీ ఎంపీపీ రాగు రాములు, పెద్దూరు మాజీ సర్పంచ్ శ్రీశైలం తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. పార్టీ పిలుపు మేరకు ఢిల్లీలో జరిగిన కార్యక్రమానికి హాజరై ప్రజాస్వామ్య పరిరక్షణకు తమ మద్దతు తెలిపారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY