Talakondapally: వివిధ పదవులు చేపట్టిన బీజేపీ నేతలకు వెంకటేశ్వర్ రెడ్డి సన్మానం!
Talakondapally: తలకొండపల్లిలో బీజేపీ, బీజేవైఎం, దళిత మోర్చా పదవులు చేపట్టిన నేతలను మాజీ మండల అధ్యక్షుడు దోర్నాల వెంకటేశ్వర్ రెడ్డి శాలువాలతో ఘనంగా సన్మానించారు.
Talakondapally: వివిధ పదవులు చేపట్టిన బీజేపీ నేతలకు వెంకటేశ్వర్ రెడ్డి సన్మానం!
తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం భారతీయ జనతా పార్టీలో వివిధ బాధ్యతలు చేపట్టిన నాయకులను బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు దోర్నాల వెంకటేశ్వర్ రెడ్డి ఘనంగా సన్మానించారు. పార్టీ కోసం కృషి చేస్తూ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న నాయకులను అభినందిస్తూ శాలువాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా బీజేపీ తలకొండపల్లి మండల అధ్యక్షుడు నీలకంఠ పాండు, నాగర్ కర్నూల్ జిల్లా దళిత మోర్చా ఉపాధ్యక్షుడు పెరుమాళ్ల రాజు, బీజేవైఎం నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మ అనిల్ ముదిరాజ్లను ఘనంగా సన్మానించారు.
పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, సంస్థాగత బలోపేతానికి నాయకులు చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం నాయకులు నర్సింహా, నాయిని కుమార్, ఈసారి బాలకృష్ణ, శ్రీను, పుట్ట రాము, ఈసారి ప్రవీణ్, వెంకటేష్, అనుపటి పాండు, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.




