Talakondapally: ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి తలకొండపల్లిలో BJYM
Talakondapally: తలకొండపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో BJYM విద్యార్థుల సమావేశం. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని "బీజేపీ లడాయి" ప్రచారం.
Talakondapally: ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి తలకొండపల్లిలో BJYM
తలకొండపల్లి: బీజేవైఎం తెలంగాణ పిలుపు మేరకు, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బీజేవైఎం నాయకులు విద్యార్థులతో సమావేశం నిర్వహించి, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశంపై అవగాహన కల్పించారు.
మాజీ ఉప సర్పంచ్ పద్మ అనిల్ ముదిరాజ్ మాట్లాడుతూ...
రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం 40 లక్షల మంది విద్యార్థులకు 15 వేల కోట్ల రూపాయల బకాలను వెంటనే విడుదల చేయాలనీ, నిరుపేద విద్యార్థుల జీవితాలతో ఆడుకోవొద్దు అని వారి కుటుంబాలకు న్యాయం చేసి వారిని ఆదుకోని, ఉన్నత చదువులకు ప్రోత్సహించాలని లేని యెడల bjym ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని డిమాండ్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, "ఫీజుల బకాయి – బీజేపీ లడాయి" ఉద్యమానికి తమ పూర్తి మద్దతు ప్రకటిస్తూ సంతకాల సేకరణ మరియు మిస్డ్ కాల్ క్యాంపెయిన్‌లో భాగంగా సంతకాలు, మిస్డ్ కాల్ ఇచ్చారు.
మీ మద్దతుగా విద్యార్థులు తెలియజేయడానికి మిస్డ్ కాల్ ఇవ్వండి: +91 82395 23455. విద్యార్థులకు రావలసిన ఫీజు రీయింబర్స్‌మెంట్ & స్కాలర్షిషప్స్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని బీజేపీ మరియు బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు.*
ఫీజుల బకాయి... బీజేపీ లడాయి!
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బక్కి కుమార్, నీలకంఠ పాండు, BJYM నాయకులు భగీరథ,BJYM అసెంబ్లీ కన్వీనర్ పద్మ అనిల్ ముదిరాజ్, BJYM మండల ఉప అధ్యక్షులు పుట్ట నాగరాజు, నాయకులు శ్రీనివాస్, ప్రవీన్, మధు, సుధాకర్, రాజు, కిరణ్, వరుణ్, కళ్యాణ్, విద్యార్థులు పాల్గొన్నారు.




