Talakondapally: అనాథ యువతి వివాహానికి ఆర్థిక సాయం అందించిన కాంగ్రెస్ నేతలు
Talakondapally: తలకొండపల్లిలో అనాథ యువతి లక్నమోని పూజా వివాహానికి కాంగ్రెస్ నాయకులు మానవతా దృక్పథంతో రూ.25,348 ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు.
Talakondapally: అనాథ యువతి వివాహానికి ఆర్థిక సాయం అందించిన కాంగ్రెస్ నేతలు
తలకొండపల్లి: చుక్కాపూర్ గ్రామానికి చెందిన అనాథ యువతి లక్నమోని పూజా (ముదిరాజ్) వివాహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మానవతా దృక్పథంతో ఆర్థిక సహాయం అందించారు. సెప్టెంబర్ 4న తలకొండపల్లి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో పూజా వివాహం జరగనుంది.
ఈ సందర్భంగా తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాసు శ్రీనివాస్ రెడ్డి రూ.10,116, మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డోకూరు ప్రభాకర్ రెడ్డి రూ.10,116, ఆమనగల్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యాట నరసింహ (ముదిరాజ్) రూ.5,116 విరాళంగా అందించారు. మొత్తం రూ.25,348 ఆర్థిక సహాయం అందించారు.
పూజా 12 సంవత్సరాల క్రితం తల్లిదండ్రులను కోల్పోయిన నేపథ్యంలో, ఆమె కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న నాయకులు వివాహ ఖర్చులకు తమవంతు సహాయం అందించారు. అనాథ యువతి వివాహానికి అండగా నిలిచిన కాంగ్రెస్ నాయకులను స్థానిక ప్రజలు అభినందించారు. విరాళాలు అందించిన నాయకులకు పూజా కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు మాకం. అంజయ్య, శ్రీనివాసులు, కాడిగే.చంద్రకుమార్, కాంగ్రెస్ నాయకులు, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.




