Talakondapally: నీలకంఠం విష్ణు కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ఆర్థిక భరోసా
Talakondapally: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన నీలకంఠం విష్ణు ఇటీవల మృతి చెందగా, కాంగ్రెస్ నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.15 వేల ఆర్థిక సహాయం అందించారు.
Talakondapally: నీలకంఠం విష్ణు కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ఆర్థిక భరోసా
తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన నీలకంఠం విష్ణు ఇటీవల మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు విష్ణు కుటుంబాని పరామర్శించి విష్ణు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం మృతుని కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసు శ్రీనివాస్ రెడ్డి రూ.6,000, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నరసింహ రూ.3,000, మాజీ మండల అధ్యక్షులు డోకూరు ప్రభాకర్ రెడ్డి రూ.3,000, ఏఎంసీ డైరెక్టర్ అంజయ్య గుప్తా రూ.3,000 చొప్పున మొత్తం రూ. 15000ఆర్థిక సహాయం అందించారు.
ఆనంతరం వారు మాట్లాడుతూ, కష్టకాలంలో బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమ పథకాలు త్వరగా అందేలా తమ వంతు కృషి చేస్తామని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజీమ్, సేవాదళ్ రాష్ట్ర నాయకులు దశరథం, డీసీసీ ప్రధాన కార్యదర్శి రవీందర్ యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి డిగ్రీ కృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవంచ నరసింహారెడ్డి, మీ సేవ మల్లేష్, యువజన కాంగ్రెస్ నాయకులు జూలపల్లి శ్రీనివాస్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.




