Talakondapally: సభను విజయవంతం చేసిన వారికి కాసు శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు!

Talakondapally: అచ్చంపేటలో నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు తలకొండపల్లి మండలం నుంచి వేలాదిగా ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయడం పట్ల కాసు శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 28 Nov 2026 8:00 AM IST
Talakondapally
X

Talakondapally: సభను విజయవంతం చేసిన వారికి కాసు శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు!

తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం అచ్చంపేటలో నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభకు తలకొండపల్లి మండలం నుంచి వేలాదిగా ప్రజలు తరలివచ్చి సభను విజయవంతం చేయడం పట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, లింగరావుపల్లి గ్రామ సర్పంచ్ కాసు శ్రీనివాస్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సభ విజయానికి సహకరించిన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

యావత్ సమాజానికి ఆధ్యాత్మిక చైతన్యాన్ని అందించిన మహనీయుడు సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణం, విగ్రహ ఏర్పాటుకు రూ.150 కోట్లు కేటాయించి శంకుస్థాపన చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

రైతులకు సాగునీరు.. మహిళలకు సంక్షేమ ఫలాలు

ముఖ్యమంత్రి ప్రకటించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రగతికి, ప్రజల సంక్షేమానికి దోహదపడతాయని కాసు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో 75 వేల ఎకరాలకు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద మరో 81 వేల ఎకరాలకు సాగునీరు అందించే చర్యలు రైతాంగానికి ఎంతో మేలు చేస్తాయని అన్నారు. కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ, కొత్తగా మంజూరైన చేయూత పింఛన్ల పంపిణీ ప్రారంభించడం ప్రభుత్వ ప్రజా సంక్షేమ నిబద్ధతకు నిదర్శనమని కొనియాడారు.

కాంగ్రెస్ శ్రేణుల ఐక్యతకు నిదర్శనం సభ విజయం

అచ్చంపేట సభకు తలకొండపల్లి మండలం నుంచి ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు చూపిన అపూర్వ స్పందన అభినందనీయమని ఆయన అన్నారు. గ్రామగ్రామాన ప్రజలను సమీకరించి, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి సభను విజయవంతం చేయడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, బ్లాక్ కాంగ్రెస్, మండల కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్, NSUI నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విభాగాల నాయకులు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ విభాగాల ప్రతినిధులు, అభిమానుల సేవలను ప్రత్యేకంగా అభినందించారు.

ప్రతి ఒక్కరి సహకారం మరువలేనిది

తలకొండపల్లి మండలం నుంచి వేలాదిగా తరలివచ్చిన ప్రజల అభిమానం, నాయకుల సహకారం, కార్యకర్తల నిరంతర శ్రమ వెలకట్టలేనివని కాసు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. సభకు తరలివచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ విజయం ఏ ఒక్కరిదో కాదని, తలకొండపల్లి మండల ప్రజలందరి విజయమని, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషికి నిదర్శనమని అన్నారు. భవిష్యత్తులోనూ ఇదే ఐక్యత, స్ఫూర్తితో ప్రజా సంక్షేమం, మండల అభివృద్ధి కోసం కలిసికట్టుగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. సభ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ మరోసారి శిరస్సు వంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY