Talakondapally: బక్కి నర్సింహా కుటుంబానికి కాసు శ్రీనివాస్ రెడ్డి పరామర్శ

Talakondapally: తలకొండపల్లి మండలం లింగరావుపల్లి కాంగ్రెస్ నేత బక్కి నర్సింహా మృతికి సర్పంచ్ కాసు శ్రీనివాస్ రెడ్డి నివాళులర్పించి, కుటుంబానికి రూ.10 వేల సాయం అందించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 27 Sept 2026 4:52 PM IST
Talakondapally
X

Talakondapally: బక్కి నర్సింహా కుటుంబానికి కాసు శ్రీనివాస్ రెడ్డి పరామర్శ

రంగారెడ్డి జిల్లా: తలకొండపల్లి మండలం లింగరావుపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బక్కి నర్సింహా అనారోగ్య కారణాలతో శనివారం సాయంత్రం మృతి చెందారు. విషయం తెలుసుకున్న తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, లింగరావుపల్లి గ్రామ సర్పంచ్ కాసు శ్రీనివాస్ రెడ్డి మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు.

ఈ సందర్భంగా నర్సింహా పార్థివదేహానికి పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ విషాద సమయంలో వారికి మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. అనంతరం నర్సింహా భార్య వనజకు తక్షణ ఆర్థిక సహాయంగా రూ.10 వేల నగదును అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బూత్కూరి వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ఎల్లమ్మ తిరుపతయ్య, వార్డు సభ్యులు లక్ష్మీదేవి, వెంకటయ్య, శేఖర్, సుమన్, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు తిరుపతి, గ్రామ నాయకులు రాములు, రవి, టీంకు, ప్రదీప్ రెడ్డి, రబ్బానీ, శ్రీను, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY