Talakondapally: ఇందిరాగాంధీ సేవలు చిరస్మరణీయం కాసు శ్రీనివాస్
Talakondapally: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం లింగరావుపల్లిలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు.
Talakondapally: ఇందిరాగాంధీ సేవలు చిరస్మరణీయం కాసు శ్రీనివాస్
తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం లింగరావుపల్లి గ్రామంలో భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న ఇందిరాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, గ్రామ సర్పంచ్ కాసు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యం వహించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం కాసు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... దేశాభివృద్ధి, పేదల సంక్షేమం, జాతీయ ఐక్యత, సమగ్రత కోసం ఇందిరాగాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. దేశం ఎదుర్కొన్న ఎన్నో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని భారతదేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు ఆమె చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.
ఆమె ధైర్యం, తెగువ, ప్రజాసేవా స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ ఆశయాలు, సిద్ధాంతాలను కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజాసేవకు కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సురేందర్ రెడ్డి, శేఖర్, భాగ్య, చెన్నయ్య, లక్ష్మీదేవి, వెంకటయ్య, మాజీ వార్డు సభ్యులు భాస్కర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, రాములు, ఎల్లయ్య, యాదయ్య, సైదులు, సత్యయ్య, వెంకటయ్య, శ్రీశైలం, సాయిలు తదితరులు పాల్గొన్నారు.




