Talakondapally: తలకొండపల్లిలో 11 మొబైల్ ఫోన్లు రికవరీ
Talakondapally: తలకొండపల్లి పోలీసులు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రూ.లక్షల విలువైన 11 మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అందజేశారు.
Talakondapally: తలకొండపల్లిలో 11 మొబైల్ ఫోన్లు రికవరీ
రంగారెడ్డి జిల్లా: తలకొండపల్లి మండలం తలకొండపల్లి పోలీసులు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా 11 సెల్‌ఫోన్లను గుర్తించి బాధితులకు తిరిగి అప్పగించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో పోగొట్టుకున్న, చోరీకి గురైన ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. క్రైమ్ కానిస్టేబుల్ జాషువా సాంకేతిక ఆధారాలతో ఫోన్లను గుర్తించడంలో కృషి చేశారు. రికవరీ చేసిన ఫోన్లను ఇన్‌స్పెక్టర్ వి. జానకిరామ్ రెడ్డి, ఎస్‌ఐ శేఖర్ బాధితులకు అందజేశారు. ఫోన్లు తిరిగి పొందిన బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ జానకిరామ్ రెడ్డి క్రైమ్ కానిస్టేబుల్ జాషువాను అభినందించారు. ప్రజల ఆస్తులను కాపాడటం పోలీసుల ప్రధాన బాధ్యతని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పోగొట్టుకున్న ఫోన్లను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సెల్‌ఫోన్లు పోగొట్టుకున్నవారు పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.




