Talakondapally: తలకొండపల్లిలో అరుదైన బ్రహ్మ కమలం విరబూసింది
Talakondapally: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలో కాంగ్రెస్ నాయకుడు తిరుపతి ముదిరాజ్ ఇంట్లో కనువిందు చేసిన అరుదైన బ్రహ్మ కమలం పువ్వు. ఆనందంలో కుటుంబ సభ్యులు.
Talakondapally: తలకొండపల్లిలో అరుదైన బ్రహ్మ కమలం విరబూసింది
తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉప్పనమోని జుట్టు తిరుపతి ముదిరాజ్ ఇంట్లో అరుదైన బ్రహ్మ కమలం పువ్వు విరబూసింది.
బ్రహ్మ కమలం అనేది చాలా అరుదైన పుష్పం ఏడాదికి ఒకసారి మాత్రమే,అది కూడా రాత్రి సమయంలో పూసి తెల్లవారేలోపు వాడిపోతుంది.
బ్రహ్మ కమలం విరబూసిన దృశ్యాన్ని చూసి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.హిందూ సంప్రదాయంలో ఈ పువ్వుకు ఎంతో విశిష్టత ఉందని విశ్లేషకులు చెబుతూ ఉంటారు.
ఇంట్లో ఈ మొక్క ఉంటే శుభం జరుగుతుందని భక్తుల నమ్మకం.ఈ పుష్పం నుండి అద్భుతమైన సువాసన వస్తుంది. సాధారణంగా ఒకటి పూసినా చూడటానికి జనం వస్తుంటారు. బ్రహ్మ కమలాన్ని చూడటం అదృష్టంగా భావిస్తున్నారు
Next Story




