Talakondapally: ఎమ్మెల్యే కసిరెడ్డికి సింగిల్ విండో చైర్మన్ వినతి!
Talakondapally: విద్యుత్ కోతలు నివారించి, సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి సింగిల్ విండో చైర్మన్ గట్ల కేశవరెడ్డి విజ్ఞప్తి చేశారు.
Talakondapally: ఎమ్మెల్యే కసిరెడ్డికి సింగిల్ విండో చైర్మన్ వినతి!
తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలోని పడకల్, లింగారావుపల్లి, రామకృష్ణాపురం, దేవునిపడకల్, పెద్దూర్ తండా, వెంకటాపూర్ తండా గ్రామాల్లో విద్యుత్ సమస్యను పరిష్కరించాలని సింగిల్ విండో చైర్మన్ గట్ల కేశవరెడ్డి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని కోరారు. ఆల్వాల్ 132 కేవీ కేంద్రం నుంచి పడకల్ సబ్‌స్టేషన్‌కు అధిక లోడ్ కారణంగా తరచూ విద్యుత్ ట్రిప్ అవుతోందని, దీంతో చేతికొచ్చిన వరి పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు.
ఫీడర్‌పై లోడ్ తగ్గించి నాణ్యమైన విద్యుత్ అందించాలని కోరారు. అలాగే సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. కొనుగోళ్లు ఆలస్యం కావడంతో దసరా ఖర్చుల కోసం రైతులు తక్కువ ధరలకు పత్తిని అమ్ముకోవాల్సి వస్తోందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ ముదిరాజ్, గూడూరు శ్రీనివాస్ రెడ్డి, కాకి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.




