Secunderabad: ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలి!
Secunderabad: ఏబీవీపీ ఆధ్వర్యంలో తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు వినతిపత్రం. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై అసెంబ్లీలో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తలసాని హామీ.
Secunderabad: ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలి!
Secunderabad: ఏబీవీపీ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీగా బయలుదేరి వచ్చి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్న ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలి.
మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పెండింగ్ లో ఉన్న ఫీజు రీ యంబర్స్ మెంట్ బకాయిలను వెంటనే చెల్లించేలా ప్రభుత్వం పై వత్తిడి తేవాలని ABVP ఆధ్వర్యంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ప్రభుత్వం సకాలంలో పీజు రీ యంబర్స్ మెంట్ లు చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు చదువు పూర్తయిన ఫీజులు చెల్లించలేదని విద్యా సంస్థల యాజమాన్యాలు సర్టిఫికెట్ లను ఇవ్వడం లేదు.
కేసీఆర్ ప్రభుత్వం లో ఏ రోజు ఇలాంటి పరిస్థితులు రానీయలేదు..ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులే కాదు. తల్లిదండ్రులు కూడా మానసిక వత్తిడులకు గురవుతున్నారుఈ నెల 7 నుండి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలలో పీజు రీ యంబర్స్ మెంట్ పై ప్రభుత్వం పై వత్తిడి తీసుకోస్తాం.
రాష్ట్రంలో ని విద్యార్థులకు బి ఆర్ ఎస్ పార్టీ అండగా ఉంటుంది బకాయి ఫీజు రీయంబర్స్ మెంట్ నిధులు విడుదల చేసే వరకు ప్రభుత్వం పై పోరాడతాం.
ప్రభుత్వం మెడలు వంచి ఫీజు రీ యంబర్స్ మెంట్ నిధులు విడుదల చేయిస్తాం. విద్యార్థులు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం పై ఐక్య పోరాటాలు నిర్వహించాలి. తలసాని శ్రీనివాస్ యాదవ్.




