Talkondapally: పడకల్ గ్రామంలో పల్స్ పోలియో.. చిన్నారులకు చుక్కలు వేత

Talkondapally: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం పడకల్ గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం; ఐదేళ్లలోపు చిన్నారులకు చుక్కలు వేయించాలని సర్పంచ్ పిలుపు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 22 Nov 2026 11:29 PM IST
Talkondapally
X

Talkondapally: పడకల్ గ్రామంలో పల్స్ పోలియో.. చిన్నారులకు చుక్కలు వేత

తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం పడకల్ గ్రామంలో ఆదివారం పోలియో చుక్కల కార్యక్రమం గ్రామ సర్పంచ్ సునీత ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శరణ్య, ఏఎంసీ డాక్టర్ విజయలక్ష్మి, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు, గ్రామ నాయకులు, పెద్దలు పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ సునీత ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, పిల్లల ఆరోగ్యమే గ్రామ భవిష్యత్తు అని పేర్కొన్నారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం తల్లిదండ్రుల బాధ్యత అని, ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు వేయించుకోకుండా మిగిలిపోకూడదని సూచించారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY