Tandur: 16వ వార్డులో ప్రత్యేక డ్రైవ్ గుంతల రోడ్లకు శాశ్వత పరిష్కారం!

Tandur: తాండూరు మున్సిపాలిటీ 16వ వార్డులో కౌన్సిలర్ శ్రీమతి నారా శ్రీలత శ్రీకాంత్ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్.

Srikanth Reddy, Tandur
Published on: 25 July 2026 9:51 AM IST
Tandur
X

Tandur: 16వ వార్డులో ప్రత్యేక డ్రైవ్ గుంతల రోడ్లకు శాశ్వత పరిష్కారం!

Tandur: తాండూరు మున్సిపల్ పరిధిలోని 16వ వార్డులో వార్డు కౌన్సిలర్ శ్రీమతి నారా శ్రీలత శ్రీకాంత్ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ...

వార్డులో గుంతలతో అధ్వాన్నంగా మారిన రోడ్లను ప్రజల రాకపోకలకు అనుకూలంగా తీర్చిదిద్దేందుకు, డస్ట్ మరియు మోరంను వేయించి గుంతలను పూడ్చివేయడం జరిగిందన్నారు.

ప్రజల ఇబ్బందులను గుర్తించి, వారి సౌకర్యమే లక్ష్యంగా వెంటనే స్పందిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. వర్షాకాలంలో ప్రమాదాలకు కారణమవుతున్న గుంతలను పూడ్చివేయడం ద్వారా వాహనదారులు, పాదచారులు సురక్షితంగా ప్రయాణించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ప్రజలకు అవసరమైన ప్రతి సమస్య పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు.16వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దే దిశగా ముందుకు సాగుతున్నారు.

Srikanth Reddy, Tandur

Srikanth Reddy, Tandur

Next Story