Tandur: ఓటర్ల జాబితా తారుమారుకు కాంగ్రెస్ కుట్ర కౌన్సిలర్ జావిద్
Tandur: తాండూరులో ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ ఓటర్లను తొలగించే కుట్ర చేస్తున్నారని కౌన్సిలర్ జావిద్ విమర్శించారు.
Tandur: ఓటర్ల జాబితా తారుమారుకు కాంగ్రెస్ కుట్ర కౌన్సిలర్ జావిద్
తాండూర్: వార్డు అభివృద్ధిపై శ్రద్ధ లేదు కానీ ఓటర్లపై శ్రద్ధ చూపెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రకు లేపిందని బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ జావిద్ విమర్శించారు. ఆదివారం ఎస్ ఐ ఆర్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో మునిసిపల్ చైర్పర్సన్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పార్టీ నేతలు కార్యక్రమాన్ని అడ్డం పెట్టుకొని వార్డులో పర్యటిస్తూ బీఆర్ఎస్ ఓటర్లను గుర్తిస్తూ వారిని తమ వైపుకు తిప్పుకునే దుశ్చర్యకు పాల్పడడం ఏమిటని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నామన్నారు.
ఇది పార్టీ కార్యక్రమం కాదని తెలిసి కూడా పార్టీ నాయకులు వార్డులో కార్యక్రమాన్ని అడ్డుపెట్టుకొని అధికార పార్టీ బినామీలైన బి ఎల్ ఏ లతో ఓటర్ల సవరణ చేయిస్తూ బీఆర్ఎస్ ఓటర్లను తొలగించే కుట్ర జరుగుతుందన్నారు. అధికార పార్టీకి చిత్తశుద్ధి ఉంటే వార్డు అభివృద్ధికి కృషి చేయాలి తప్ప ఇతర పార్టీల ప్రతిష్టను భంగం కలిగించే నీచమైన కార్యక్రమాలు చేయకూడదన్నారు.
వార్డులో ఓటర్ల జాబితాను తారుమారు చేసే కుట్ర జరుగుతున్నదని తాము దానిని ముందుకు సాగనివ్వమన్నారు. కపట ప్రేమ ఓటర్ల పై చూపించినంత మాత్రాన ఓటర్లు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లరని బీఆర్ఎస్ పార్టీ వైపే ఉంటారని ఈ సందర్భంగా తెలుపుతున్నామన్నారు. తాండూరు బీఆర్ఎస్ అడ్డా అనే విషయాన్ని వచ్చే ఎన్నికల్లో చూపిస్తామన్నారు.




