Tandur: బీఆర్‌ఎస్ నిరసన 420 ఫీట్ల ఫ్లెక్సీతో పైలట్ రోహిత్ రెడ్డి ధర్నా!

Tandur: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై తాండూరులో బీఆర్‌ఎస్ నిరసన. 420 హామీలు నెరవేర్చలేదని 420 ఫీట్ల ఫ్లెక్సీ ప్రదర్శించిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి.

Srikanth Reddy, Tandur
Published on: 3 Sept 2026 8:36 AM IST
Tandur
X

Tandur: బీఆర్‌ఎస్ నిరసన 420 ఫీట్ల ఫ్లెక్సీతో పైలట్ రోహిత్ రెడ్డి ధర్నా!

Tandur: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు గడిచినప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ బిఆర్ఎస్ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నిరసన వ్యక్తం చేశారు.

తాండూర్ బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు... ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదంటూ, నిరసనగా 420 ఫీట్ల ఫ్లెక్సీని ప్రదర్శించారు.

ఈ సందర్భంగా పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ కల్లబొల్లి మాటలు చెప్పి ఎన్నికల సమయంలో ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ పార్టీ, ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు... ఆరు గ్యారెంటీలు, 420 హామీలను తుంగలో తొక్కి ప్రజలకు ద్రోహం చేసిందని దుయ్యబట్టారు.. బిఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు పూర్తయ్యాయన్నారు.

తాండూరులో 1680 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను చేపట్టినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను, గ్యారెంటీలను పూర్తిస్థాయిలో ప్రజలకు అందించాలని డిమాండ్ చేశారు.

Srikanth Reddy, Tandur

Srikanth Reddy, Tandur

Next Story