Tandur: ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ సస్పెన్షన్‌కు బీఆర్ఎస్వీ డిమాండ్
Tandur: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలున్న లెక్చరర్ కిష్టప్పను వెంటనే సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు.
Tandur: ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ సస్పెన్షన్‌కు బీఆర్ఎస్వీ డిమాండ్
తాండూర్: తాండూర్ టౌన్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒక విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న లెక్చరర్ కిష్టప్పపై వెంటనే చర్యలు తీసుకొని, విచారణ పూర్తయ్యే వరకు ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేయాలని గురువారం ప్రిన్సిపాల్ కి బీఆర్ఎస్వి వినతి పత్రం ఇచ్చింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ...
విద్యార్థిని పట్ల లెక్చరర్ అసభ్యంగా ప్రవర్తించాడన్నా ఘటనపై గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నప్పటికీ, ఇప్పటివరకు సంబంధిత లెక్చరర్‌పై కఠిన చర్యలు తీసుకోకపోవడం పట్ల బి ఆర్ ఎస్ వి తరపున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నామన్నారు. విద్యార్థినుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నామన్నారు.
ఈ విషయంపై ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పాటు, జిల్లా కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
సంబంధిత లెక్చరర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేసి, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్వి తన పోరాటాన్ని, ఫిర్యాదులను కొనసాగిస్తూనే ఉంటుందని హెచ్చరిస్తున్నామన్నారు . ఈ కార్యక్రమం లో పాల్గొన్నా బి ఆర్ ఎస్ వి జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయ రావు, వినోద్ కుమార్, అబేద్, తౌసీఫ్ షకీల్, తదితరులు పాల్గొన్నారు.




